Mahammed shami interview shoaib akhtar icc world cup 2015

Mahammed shami news, Mahammed shami interivew, Mahammed shami worldcup 2015, Mahammed shami career, Mahammed shami cricketer, Mahammed shami bowler, Mahammed shami press meet, Shoaib akhtar news, Shoaib akhtar news, shoaib akhtar cricket innings, icc world cup 2015

Mahammed shami interview Shoaib akhtar icc world cup 2015 : Indian pacer mahammed shami says thanks to Shoaib akhtar for giving him suggestions in bowling session.

షోయబ్ అఖ్తర్ వల్లే భారత బౌలర్ కు సక్సెస్!

Posted: 03/09/2015 01:55 PM IST
Mahammed shami interview shoaib akhtar icc world cup 2015

దాయాది దేశాలైన పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య ఎన్ని విబేధాలున్నాయో.. మైదానంలో క్రికెట్ ఆటగాళ్ల మధ్య కూడా అంతే వుంటుంది! కానీ.. మైదానం బయటమాత్రం వారిమధ్య అటువంటి విభేదాలు ఏమాత్రం వుండవని తాజా ఘటనను నిదర్శనంగా తీసుకోవచ్చు.

ప్రపంచకప్ టోర్నమెంట్ లో టీమిండియా బౌలింగ్ విభాగంలో పేసర్ మహ్మద్ షమి అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు. అంతకుముందు జరిగిన ఆసిస్ పర్యటనలో తన ప్రతిభను చాటుకోలేకపోయిన ఈ పేసర్.. వరల్డ్ కప్ లో మాత్రం స్టార్ బ్యాట్స్ మెన్లను సైతం కట్టడి చేస్తున్నాడు. అయితే.. తాను ఈ విధంగా ఫాం అందిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ మాజీ బౌలర్ అయిన షోయబ్ అఖ్తరే కారణమని షమి పేర్కొంటున్నాడు. అతడు ఇచ్చిన సలహాల మేరకే తాను బౌలింగ్ లో బాగా రాణించగలుతున్నానని తెలుపుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే షమి మాట్లాడుతూ.. ‘ఇటీవలే నేను షోయబ్ భాయ్ తో మాట్లాడాను. ఆ సందర్భంలో అతడు నాకు బౌలింగ్ విభాగంలో కొన్ని సలహాలు ఇచ్చాడు. రనప్ తగ్గించుకోమని సూచించాడు. పెద్దపెద్ద అంగలకు బదులు చిన్న అంగలతోనే క్రీజు వద్దకు చేరుకోవాలని సలహా ఇచ్చాడు. అతడిచ్చిన ఆ సలహా మైదానంలో పాటించగా.. అది ఫలించింది. కొత్త రనప్ ఎంతో సౌకర్యవంతంగా వుండటంతో పేస్ రాబట్టగలుగుతున్నాను’’ అని వివరించాడు. అందుకు తాను షోయబ్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లుగా వెల్లడించాడు.

ఇదిలావుండగా.. ఇంతవరకు భారత్ వరల్డ్ కప్ లో నాలుగు జట్లతో తలపడి.. ఇప్పటికే క్వార్టర్స్ లో తన బెర్తు ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ మ్యాచులన్నింటిలోనూ కలిపి షమి తక్కువ ఎకానమీతో మొత్తం 9 (పాకిస్టాన్ -4, వెస్టిండీస్ -3, సౌతాఫ్రికా -2) వికెట్లు తీసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahammed shami  shoaib akhtar  icc world cup 2015  

Other Articles