Muttiah muralitharan kumar sangakkara virat kohli ab de villiers icc world cup 2015

muttiah muralitharan news, muttiah muralitharan press meet, muttiah muralitharan interview, muttiah muralitharan photos, muttiah muralitharan latest news, kumar sangakkara news, kumar sangakkara worldcup 2015, kumar sangakkara worldcup innings, kumar sangakkara latest news, virat kohli news, virat kohli worldcup 2015, ab de villiers 2015 worldcup

muttiah muralitharan kumar sangakkara virat kohli ab de villiers icc world cup 2015 : SriLankan Former spinner muttiah muralitharan reveals his opinion that all worldcup teams are fearing with kumar sangakkara. Because he is playing well in this tournament.

కోహ్లీకి అంత సీన్ లేదు కానీ.. సంగక్కరే డేంజర్!

Posted: 03/09/2015 01:14 PM IST
Muttiah muralitharan kumar sangakkara virat kohli ab de villiers icc world cup 2015

ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా ప్రధాన జట్లలోని కొందరు స్టార్ ఆటగాళ్లు అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. అందులో కోహ్లీ, డివిలియర్స్, మాక్స్ వెల్ తదితర ఆటగాళ్లు మైదానంలో పరుగుల వర్షాన్ని కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఆపదలో వున్న సమయంలో ఈ ఆటగాళ్లే తమ జట్టును ఆదుకుంటూ గెలుపు దిశగా తీసుకెళుతున్నారు. ఇక సగటు అభిమానులంతా వీరిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వీరందరికంటే శ్రీలంక జట్టు ఆటగాడు సంగక్కర ఇంకా డేంజరంటూ మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన వ్యాఖ్యానిస్తున్నాడు. ఆ ముగ్గురు ఆటగాళ్లు బాగానే ఆడుతున్నారు కానీ.. వారికంటే సంగక్కరను చూసి అన్ని టీంలు భయపడుతున్నాయంటూ అతను పేర్కొంటున్నాడు.

ఈ వరల్డ్ కప్ లో సంగక్కర్ గా వరుసగా మూడు మ్యాచుల్లోనూ సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. మొత్తం 5 మ్యాచుల్లో 377 స్కోరు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సంగక్కరను చూసి ఇతర టీంలు భయపడుతున్నాయని మరళీధరన్ పేర్కొన్నాడు. సంగక్కర రూపంలో వన్డే క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ను లంక కలిగివుందని ఐసీసీ వెబ్ సైట్ కు రాసిన కాలమ్ లో ఆయన అభిప్రాయపడ్డాడు. ‘మీరు కోహ్లీ, డివిలియర్స్ లేదా మ్యాక్స్ వెల్ గురించి మాట్లాడుకోవచ్చు. వీరందరూ ప్రస్తుతం టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడుతున్నారు. అయితే.. వీరందరి కంటే సంగక్కరను చూసి అన్ని టీంలు భయపడతాయి’’ అంటూ ముత్తయ్య అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అలాగే.. పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఎదుర్కొన్న బంతులకంటే అధిక పరుగులు సాధించడమే అభినందనీయమని మురళీ పేర్కొన్నాడు. తన చివరి వరల్డ్ కప్ ఆడుతున్న సంగక్కర.. కప్ గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడని, ఆ దిశగానే అధిక పరుగులు చేస్తూ తన జట్టును ఆదుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్నాడని మురళి చెప్పాడు. ఇదిలావుండగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సంగక్కర సెంచరీతో రాణించినప్పటికీ.. శ్రీలంక ఓటమిపాలైన విషయం తెలిసిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muttiah muralitharan  virat kohli  kumar sangakkara  ab de villiers  

Other Articles