Bangladesh vs england match world cup 2015

bangladesh vs england, bangladesh vs englang world cup 2015, world cup 2015 news, bangladesh cricketers, england cricketers

bangladesh vs england match world cup 2015 : England lost against bangladesh in world cup 2015. So that they are eleminate from this worldcup.

పసికూన చేతిలో క్రికెట్ సృష్టికర్త ఢమాల్...

Posted: 03/09/2015 06:14 PM IST
Bangladesh vs england match world cup 2015

ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా ఆడిలైడ్ లో జరిగిన మ్యాచులో పసికూన అయిన బంగ్లాదేశ్ చేతిలో క్రికెట్ ని సృష్టించిన ఇంగ్లాండ్ లాంటి భారీ జట్టు చిత్తుగా ఓడిపోయింది. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ గెలవని ఇంగ్లాండ్.. అది గెలవాలన్న ఆశ ఈసారి కూడా కలగానే మిగిలిపోయింది.  ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో కేవలం 15 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ అఖండ విజయాన్ని సాధించింది.

ఈ వరల్డ్ కప్ మొత్తం ఐదు మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్.. కేవలం ఒక్క మ్యాచే గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్ 3 మ్యాచులు గెలవగా.. అందులో ఒక మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. దీంతో బంగ్లా ఖాతాలో 7 పాయింట్లు నమోదు కాగా.. అది గ్రూప్ -ఏలో మూడో స్థానంలో నిలిచింది. అంటే.. బంగ్లాదేశ్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ చతికిలపడిపోయి.. ఇంటిదారి పట్టిగా.. బంగ్లాదేశ్ క్వార్టర్స్ కు దూసుకెళ్లింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో మహ్మదుల్లా సెంచరీ, ముష్ఫికర్ అర్ధసెంచరీలతో పరుగుల వర్షాన్ని కురిపించగా.. బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది.  మహ్మదుల్లా 138 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. వేగంగా ఆడిన ముష్ఫికర్ 76 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో 89 పరుగులు సాధించాడు. సౌమ్య సర్కార్ 40, సబీర్ 14 పరుగులు చేశారు. ఇలా బంగ్లా ఆటగాళ్లు చాకచక్యంగా బ్యాటింగ్ ఆడి 275 పరుగులు చేయగలిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, జోర్డాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇక 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్... 48.3 ఓవర్లలోనే 260 పరుగులు చేసి ఆలౌటైంది. సాధారణ లక్ష్యమే కదా ఈజీగా గెలిచేస్తుందని ఇంగ్లాండ్ అభిమానులు అంతా భావించారు కానీ.. వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ ఇన్నింగ్స్ లో ఇయాన్ బెల్ (63) హాఫ్ సెంచరీ చేశాడు. కాగా ఇతర టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. చివర్లో బట్లర్ (65), వోక్స్ (42 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లు ఇంగ్లాండు ఆటగాళ్లకు తన ప్రతిభతో బాగానే కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లు రూబెల్ హొసేన్కు నాలుగు, మోర్తజా, టస్కిన్ కు చెరో రెండు వికెట్లు పడ్డాయి. ఇక సెంచరీ హీరో మహ్మదుల్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh vs england  icc world cup 2015  

Other Articles