Australia steps into quarter finals defeating srilanka

australia steps into quarter finals, australia beat srilanka by 64 runs, Glenn Maxwell Smashes Second-Fastest World Cup Century, Glenn Maxwell, Srilanka versus Australia, Srilanka vs Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Srilanka, Srilanka CWC 2015, Sangakkara, Live Scores, Live Updates, Australia, Australia CWC 2015, Sports, World Cup Live

australia steps into quarter finals defeating srilanka by 64 runs

క్వార్టర్ ఫైనల్స్ లోకి కంగారులు.. ఓడిన లంకేయులు..

Posted: 03/08/2015 05:28 PM IST
Australia steps into quarter finals defeating srilanka

క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా విజయాన్ని నమోదు చేసుకుని క్వార్టర్ ఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీలంకపై కంగారులు 64 పరుగులతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. 377 పరుగుల లక్ష్య చేధనలో  శ్రీలంక టాఫ్ ఆర్డర్ ధీటుగా ఎదుర్కోన్నా.. మిడిల్ ఆర్డర్ తడబాటు.. టెల్ ఎండర్స్ కుప్పకూలడంతో లంక 312 పరుగులకు తొమ్మిది వికెట్లను నష్టపోయింది. చివర్లో లంక బ్యాట్స్ మెన్ చండిమాల్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. గెలుపు కోసం ఒంటరిపోరాటం చేసిన సంగక్కర్ సెంచరీ వృధా అయ్యింది.

అసీస్ భారీ లక్ష్యం భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన లంక ఆదిలోనే వికెట్ కోల్పోయింది. లహీరు తిరుమణ్ణే ఐదు బంతులు ఎదుర్కోని 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఈ తరుణంలో ఓపెనర్ దిల్షాన్ తో జతకట్టిన సంగక్కర.. ధీటుగా ఆడారు. 104 వ్యక్తిగత స్కోరు వద్ద సంగక్కర్ ఔటయ్యాడు. ఆ తరువాత మాధ్యూవ్స్ దినేష్ చండిమల్ స్కోరుబోర్డును పరిగెత్తించారు. మాధ్యూవ్స్ 35 పరుగలకు, చండీమల్ 52 పరుగులు సాధించారు. అయినా చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన అసీస్ లంకపై గెలుపును సాధించింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగులకే వార్నర్ వికెట్‌ను, 41 పరుగుల వద్ద ఫించ్ వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్, క్లార్క్‌లు మరో వికెట్ పడకుండా ఆదుకున్నారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీలను సాధించారు. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లార్క్... మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 177 పరుగుల వద్ద స్మిత్(72) వికెట్‌ను కూడా ఆసీస్ కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన మాక్స్‌వెల్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేసి తాజా ప్రపంచకప్‌లో రెండో వేగవంతమైన శతకం రికార్డును తన పేరున రాసుకున్నాడు. సెంచరీ సాధించిన వెంటనే మాక్స్ వెల్ ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఫాల్కునర్ కూడా వెంటెనే పెవీలియన్ ముఖం పట్టాడు. మరోపక్క వాట్సన్ కూడా అర్ధశతకంతో దూకుడు పెంచాడు. 368 పరుగుల వద్ద వాట్సన్(67), 373 పరుగుల వద్ద హడిన్(25), స్టార్క్(0) లు ఔటవ్వగా, దోహర్తి 0(1), జాన్సన్3(3) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. లంక బౌలర్లలో మలింగ, పెరీరా చెరో రెండు వికెట్లు తీయగా, మాథ్యూస్, ప్రసన్న, దిల్షాన్ తలో వికెట్ తీశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Australia  Srilanka  

Other Articles