South africans dont need psychologists russell domingo

south africans dont need psychologists, south africans dont need psychologists says russell domingo, south african coach russell domingo,

south african cricket team dont need psychologists says their coach russell domingo

మానసిక నిపుణుల అవసరం మాకు లేదు..

Posted: 02/19/2015 08:43 PM IST
South africans dont need psychologists russell domingo

వన్డే వరల్డ్ కప్ లో దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికాననే చెప్పాలి. ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు సెమీస్ కు చేరే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది ఈ జట్టే కాబట్టి. అయితే ఈ సారి ప్రొటీస్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఈ జట్టు భారత్ తో ఆదివారం నాడు తలపడనుంది. ఇప్పటికే ధాయాది దేశం పాకిస్తాన్ పై నెగ్గి.. తొలి బోణితో పరుగులు తీస్తున్న టీమిండియా.. దక్షిణాఫ్రికాతో ఖచ్చితంగా నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు కొంత వత్తిడికి గురవుతున్నారన్న కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మానసిక నిపుణలను ఆశ్రయిస్తే బావుంటదన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి.

జింబాబ్వే జట్టను మట్టికరిపించడంతో సర్వశక్తులు ఓడ్డిన దక్షిణాప్రికా..  టీమిండియాతో తలపడనున్న నేపథ్యంలో వచ్చిన కథనాలను ఆ జట్టు కోచ్ రస్సెల్ డొమింగో ఖండించాడు. అసలు తమకు అటువంటి అవసరం ఏమీ లేదంటూ తాజాగా స్పష్టం చేశాడు. ఆటగాళ్ల దగ్గర నైపుణ్యం ఉంటే మానసిక నిపుణుల సహకారం అవసరం లేదని తెలిపాడు. తాను ఏడాది కాలానికి పైగా సఫారీలు కోచ్ గా పనిచేస్తున్నానని, గడిచిన 8 నుంచి 9 నెలల కాలంలో తాము ఎటువంటి సైకాలజిస్ట్ ల సహకారం తీసుకోలేదని చెప్పారు. ఇది కీలక టోర్నమెంట్ కావచ్చు. అయినా తమకు మానసిక నిఫుణుల అవసరం లేదని డొమింగో తెలిపాడు. తాను ఆటగాళ్ల నైపుణ్యంపైనే ఎక్కువ ఆధారపడతానని.. మానసిక వైద్యుల సలహాలపై కాదని తేల్చి చెప్పాడు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket-world cup-2015  south africa  russell domingo  

Other Articles