Icc cricket world cup with led stumps

Icc cricket world cup with led stumps, Icc cricket world cup with led bails, cost of led stumps, cost of led bails, cost of latest stumps, led stumps and bails, 25 lakh ruppees,

Icc cricket world cup led stumps and bails worth more than Rs. 25 lakhs

తాకితే చాలు వెలిగిపోతున్న ఎల్ఈఢీ స్టంప్స్

Posted: 02/19/2015 08:44 PM IST
Icc cricket world cup with led stumps

వన్డే క్రికెట్, టీ 20 క్రికెట్ ఫార్మెట్ లలో స్టంప్స్ కు తో వికెట్ కీపర్లు చేసే అవుట్ లకు ఒక్కోసారి థర్డ్ ఎంపైర్ కూడా ఢిపెన్స్ లో పడి బ్యాట్స్ మెన్ ఫేవర్ గా తీర్పును వెలువరిస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వచ్చిన స్టంప్స్ తో ఎంపైర్, లెట్ ఎంపర్లు చకచకా నిర్ణయాలను వెల్లడిస్తున్నారు. ఎందకంటారా అవి ఎఈఢీ స్టంప్స్ కాబట్టి. అయితే ఎంటి..? వాటికెంటి ప్రత్యేకత అంటారా..? క్రికెట్ లో బంతి స్టంప్స్ ను గిరాటెయ్యగానే మళ్లీ వాటిని తెచ్చి బ్యాట్ హేండిల్ తో కొట్టి పాతడం చూస్తుంటాం. తాజా ప్రపంచకప్ లో అలా కుదరదు. ఎందుకంటే ఇవి చాలా సున్నితమైనవి. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఎల్ ఈడీ స్టంప్స్, వాటికి చాలా ప్రత్యేకతలున్నాయి. వాటితో ముందుగా బంతి తగలగానే అవి వెలిగిపోతుంటాయి.

మూడు ఎల్ఈడీ స్టంప్స్ ఖరీదు అక్షరాలా  24 లక్షల రూపాయలు. బెయిల్స్ ధర దాదాపు 50 వేల రూపాయలు. మొత్తంగా సుమారు పాతిక లక్షలన్నమాట. ఎల్ఈడీ స్టంప్స్ తో అంపైర్ల పని సులువైంది. బంతికి వీటికి తగిలినప్పుడు వీటిలోని లైట్లు దానంతట అవే వెలుగుతాయి. బంతి తగిలింది, లేనిది స్పష్టంగా అర్థమవుతుంది. 2013 బిగ్ బాష్ లో తొలిసారిగా ఎల్ ఈడీ స్టంప్స్ వాడారు. తర్వాత టి20 ప్రపంచకప్ లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. వీటిపై సానుకూల స్పందన రావడంతో వన్డే వరల్డ్ కప్ లోనూ వాడుతున్నారు. ఈ మొత్తం సెట్ విలువ దాదాపు రూ. 25 లక్షలు. అందుల్లే మ్యాచ్ ముగిసిన తర్వాత స్టంప్స్ ను పీకడానికి అనుమతించడం లేదని వీటి సృష్టికర్త ఎకెర్ మాన్ తెలిపారు.

మ్యాచ్ గెలిచిన వెంటనే స్టంప్స్ తీసుకెళ్లడం ఇదివరకు జరిగేది. అది విజయగర్వంగా కూడా చెప్పుకునే వాళ్లు. కానీ తాజాగా అమర్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడివున్న స్టంప్స్ వల్ల వాటిని తీసుకెళ్లడం కుదరదని ఆటగాళ్లకు ఐసీసీ కూడా స్పష్టం చేసింది. తన వాణిజ్య భాగస్వామి డేవిడ్ లీజిత్ వుడ్ తో కలిసి సుమారు మూడేళ్ల పాటు కష్టపడి అతడు వీటిని తయారు చేశాడు. వీటిని చాలా జాగ్రత్తగా వాడాల్సివుంటుందని అతడు తెలిపాడు. లసిత్ మలింగ యార్కర్ కు స్టంప్స్ విరిగిపోయే ప్రమాదముందని ఎకెర్ మాన్ భయపడుతున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Icc cricket-world cup-2015  LED stumps  bails  

Other Articles