India vs pakistan cricket match fixing pak muslim league youth wing aslam khan twitter controversy

india vs pakistan match, india vs pakistan 2015, 2015 world cup news, india vs pakistan 2015 world cup, india won pakistan 2015, pak muslim league youth wing aslam khan, india match fixing controversy, india world cup match fixing, aslam khan twitter controversy

india vs pakistan cricket match fixing pak muslim league youth wing aslam khan twitter controversy : The Rumours are going now on pakistan and india cricket match is that india had match fixed.

పాక్ పై గెలిచిన ఇండియా ‘ఫిక్సింగ్’కు పాల్పడిందా..?

Posted: 02/16/2015 01:39 PM IST
India vs pakistan cricket match fixing pak muslim league youth wing aslam khan twitter controversy

ప్రపంచకప్ -2015లో భాగంగా ఫిబ్రవరి 15 (ఆదివారం)వ తేదీన దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ గెలిచిన విషయం తెలిసిందే! అయితే భారత్ గెలుపుపై ఇప్పుడు ‘ఫిక్సింగ్’ అనుమానాలు వెలువడుతున్నాయి. హిస్టరీని మరోసారి తిరగరాసేందుకు ఇండియా ఫిక్సింగ్ కు పాల్పడి పాక్ పై విజయం సాధించిందనే డౌట్స్ మరింత తీవ్రమవుతున్నాయి. ఈ అనుమానాలు రావడం వెనుక ఒక బలమైన కారణం కూడా వుంది. అదేమిటో తెలుసుకోవాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

పాక్-భారత్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ యూత్ వింగ్ లో పనిచేస్తున్న అస్లాం ఖాన్ తనోలి అనే యువకుడు ఆ మ్యాచ్ జ్యోష్యాన్ని ముందుగానే తెలిపాడు. ఆ మ్యాచ్ లో ఏ జట్టు ఎంత స్కోర్ చేస్తుందో, ఎవరు గెలుస్తారోనన్న విషయాలను అతగాడు ఇంకా మ్యాచ్ ముగియకముందే తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇండియా సరిగ్గా 300 పరుగులు చేస్తుందని, పాకిస్తాన్ 220 పరుగులు మాత్రమే చేయగలుగుతుందని పేర్కొన్న ఆ యువకుడు.. మ్యాచ్ చివరల్లో ఐదు ఫోర్లు వస్తాయని, తాను చెప్పిన ఈ అంకెల్లో ఎటువంటి మార్పు వుందని ఛాలెంజ్ చేస్తూ మరీ ట్వీట్ చేశాడు.

అతగాడు ఏ విధంగా అయితే మొత్తం వివరాలను తెలియపరిచాడో.. అలాగే మ్యాచ్ ఫలితాలు వెలువడ్డాయి. అతడు చెప్పినట్లుగా ఇండియా 300 స్కోరు, పాకిస్తాన్ 224 పరుగులు చేసింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అస్లాం ఖాన్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు..? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ ప్రముఖులు సైతం సందిగ్ధతలో మునిగిపోయారు. ఓవైపు ఇండియా గెలిచిందని అభిమానులు వేడుక చేసుకుంటుంటే.. మరోవైపు ఈ అనుమానాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles