Yuvraj singh father yogaraj controversial comments mahendra singh dhoni world cup 2015

yuvraj singh news, yogaraj singh news, yuvraj father yogaraj, mahendra singh dhoni news, yogaraj singh news, world cup 2015, team india selectors, india vs pakistan matches, india world cup 2015, dhoni updates

yuvraj singh father yogaraj controversial comments mahendra singh dhoni world cup 2015 : Yuvraj Singh father yogaraj has made sensational comments on team india captain mahendra singh dhoni.

ధోనీ వల్లే యువరాజ్ కి చోటు దక్కలేదు...

Posted: 02/16/2015 03:59 PM IST
Yuvraj singh father yogaraj controversial comments mahendra singh dhoni world cup 2015

టీమిండియాలో డాషింగ్ ఆల్ రౌండర్ గా పేరొందిన యువరాజ్ సింగ్.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే! ప్రాబబుల్స్ జాబితాలో సైతం యువీకి చోటు దక్కకపోవడంపై సినీ ప్రముఖులు సైతం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. క్రికెట్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించిన యువీకి ఈసారి ఎందుకు జట్టులో స్థానం కల్పించలేదంటూ ఎందరో సందేహాలు వ్యక్తం చేశారు. అటు యువరాజ్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో యువీ తండ్రి యోగరాజ్ సంచలన వ్యాఖ్యానాలు చేశారు. ధోనీ వల్లే యువీకి చోటు దక్కలేదని అన్నారు.

వరల్డ్ కప్ కు యువీ ఎంపిక కాకపోవడం వెనుక కెప్టెన్ ధోనీ హస్తముందని యోగరాజ్ ఆరోపించారు. ధోనీ ఒత్తిడి చేయడం వల్లే సెలక్టర్లు యువీకి హ్యాండిచ్చారని అన్నారు. ధోనీకి, తన కుమారుడు యువీతో ఏమైనా విభేదాలుంటే అందుకు తానేమీ చేయలేనని.. దేవుడే అంతా చూసుకుంటాడనని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ధోనీని ఉద్దేశిస్తూ ఆయన.. ఇలా దారుణంగా ప్రవర్తించడం కంటే విచారించదగ్గ అంశం మరొకటి వుండదని పేర్కొన్నారు. రానురాను ధోనీ వ్యవహారశైలి మారుతోందని, అతని వైఖరి వల్ల జట్టులో వుండే ఇతర ఆటగాళ్లకు సమస్యలు వచ్చిపడుతున్నాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరోవైపు.. తండ్రి ఈ విధంగా చేసిన సంచలన వ్యాఖ్యానాలపై యువరాజ్ స్పందించాడు. అందరిలానే తన తండ్రి కూడా ఆవేదనకు గురయ్యారని, అందుకే ఆయనలా మాట్లాడి వుంటారని అన్నాడు. ధోనీ నాయకత్వంలో తాను ఆటను ఎంతగానో ఆస్వాదించాననీ, భవిష్యత్తులోనూ ఆస్వాదిస్తాననంటూ ట్వీట్ చేశాడు. ఇదిలావుండగా.. ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత యువరాజ్ సింగ్ రంజీల్లో ఎంతో అద్భుతంగా రాణించాడు. వరుస సెంచరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో యువీకి వరల్డ్ కప్ లో బెర్త్ ఖాయమని అనుకున్నారు కానీ.. సెలక్టర్లు మాత్రం ఇతనికి మొండిచెయ్యి చూపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh father yogaraj  mahendra singh dhoni  world cup 2015  

Other Articles