Australia victory over england in world cup 2015

Australia wins over England, aussies records victory over england, aussies wins with 111 runs, aussies 111 runs victory, aussies 111 run vitory over england, ICC Cricket World Cup 2015, icc cricket world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, Australia, England, pool A scores, aussues score, england score

England humiliated in opening match as Australia beat them by 111 runs

కంగారెత్తి కోలుకున్న అసీస్, ఇంగ్లాండ్ పై విజయం..

Posted: 02/14/2015 08:37 PM IST
Australia victory over england in world cup 2015

ప్రపంచ కప్‌లో నేపథ్యంలో ముందు నుంచి దూకుడును ప్రదర్శించిన అతిధ్య జట్టు అస్ట్రేలియా తొలి రోజున జరిగిన పోటీలో విజేతగా నిలించింది. ప్రపంచకప్ లో భాగంగా మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో ఆస్టేలియా ఘన విజయం సాధించింది. 343 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 41.5 ఓవర్లలో 231 పరుగులక్ ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ జట్టులో అత్యధికంగా టేలర్ 98 పరుగులు సాధించాడు. రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వోక్స్ 37, బెల్ 36, పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమయ్యారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అసీస్ ఆటగాళ్లలో పించ్ సెంచరీ సాధించిం 135 పరుగుల వద్ద ఔటయ్యాడు.. 102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో వంద పరుగులు పూర్తిచేశాడు. ఫించ్‌కు ఈ ప్రపంచ్‌కప్‌లో ఇది తొలి సెంచరీ. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ బెయిలీ అర్ధ శతకం నమోదు చేశాడు. అర్ధ సెంచరీ సాధించిన కెప్టెన్‌ బెయిలీ 55 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోరు వద్ద ఫిన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 63 బంతుల్లో మూడు ఫోర్లతో 50 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఒకరు హ్యాట్రిక్ చేయగా.. మరొకరు కొద్దిలో హ్యాట్రిక్ మిస్సయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ ఫిన్.. వరుసగా మూడు వికెట్లు తీసి ఈ ప్రపంచకప్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫిన్ మొత్తం 5 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్ పోటీలలో ఇలా హ్యాట్రిక్ సాధించిన వాళ్లలో ఫిన్ ఏడో బౌలర్. ఇంతకు ముందు ఆరుగురు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లోని చిట్ట చివరి మూడు బంతుల్లోనే మూడు వికెట్లను తీశాడు. అతడికి తోడుగా నిలిచిన మరో బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వరుస బంతుల్లో ఓపెనర్ వార్నర్ (22), వాట్సన్ (0)ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతి మిస్ కావడంతో అతడికి హ్యాట్రిక్ తప్పినట్లయింది. ప్రపంచ కప్ పూల్-ఎలో భాగంగా శనివారం నాటి  మ్యాచ్లో కంగారూలను ఈ ఇద్దరు బౌలర్లు కంగారెత్తించినా.. అసీస్ భారీ స్కోరు సాధించి మ్యాచ్ ను 111 పరుగులతో గెలించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  icc world cup 2015  australia  england  pool A  

Other Articles