New zealand won first one day in world cup

new zealand records first win in world cup, newzealand wins first one day in world cup, newzealand wins against srilanka, new zealand 98 runs victory, ICC Cricket World Cup 2015, icc cricket world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores,

new zealand won first one day in world cup over srilanka with 98 runs

ప్రపంచకప్ లో న్యూజీలాండ్ దే తొలి విజయం..

Posted: 02/14/2015 08:35 PM IST
New zealand won first one day in world cup

వన్డే ప్రపంచకప్ లో తొలి విజయాన్ని న్యూజీలాండ్ తన పేరున నమోదు చేసుకుంది. పూల్ ఏ కు చెందిన శ్రీలంకతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో అదే పూల్ కు చెందిన న్యూజిలాండ్ 98 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కివీస్ విసిరిన 332 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక మరోసారి పేలవమైన ఫామ్ ను మూటగట్టుకుని ఘోర పరాజయాన్ని చవిచూసింది. శ్రీలంక ఆటగాళ్లలో ఓపెనర్ తిరిమన్నే(65) చూడచక్కని షాట్లతో అలరించినప్పటికీ మరో ఓపెనర్ దిల్షాన్ (24)పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
 
ఆ తరుణంలో తిరిమన్నేకు జత కలిసిన కుమార సంగక్కార కాసేపు మెరుపులు మెరిపించాడు. సంగక్కార క్రీజ్ లో నిలదొక్కుకుంటున్నాడనే సమయంలో తిరిమన్నే పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక పతనం ప్రారంభమయ్యింది.  వరుసగా కరుణరత్నే(14),  జయవర్ధనే డకౌట్ గా పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక తేరుకోలేకపోయింది. ఆ తరువాత సంగక్కార( 39) పరుగులకు పెవిలియన్ కు చేరాడు. చివర్లో కెప్టెన్ మాథ్యూస్(46) పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.  46 ఓవర్లలో చాపచుట్టేసిన శ్రీలంక 233 పరుగులకే పరిమితమయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ, బౌల్ట్, వెటోరీ, మైల్నీలు తలో రెండు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. ఓపెనర్లు గుప్తిల్(49), మెక్ కల్లమ్(65)పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం కేన్ విలియమ్సన్(57) పరుగులతో ఆకట్టుకున్నాడు. అటు తరువాత పించ్ హిట్టర్ సీజే అండర్సన్ తనదైన శైలిలో ఆడుతూ శ్రీలంక బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. 46 బంతులను ఎదుర్కొన్న అండర్సన్ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్ లు సాయంతో 75 పరుగులు చేసి చివరి బంతికి పెవిలియన్ కు చేరాడు. అతనికి జతగా రోంచీ(29) నాటౌట్ గా  క్రీజ్ లో ఉండటంతో కివీస్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల కోల్పోయి 331పరుగులు చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  pool A  newzealand  srilanka  

Other Articles