Team india to enter world cup in second position

world cup fixtures, ‎ICC Rankings, ‎ICC Player Rankings, world cup ‎Venues, icc world cup 2015, world cup defending champions, 2015 Cricket World Cup, ‎2011 Cricket World Cup, ‎List of Cricket World Cup records, ICC Cricket World Cup 2015, world cup winners, world cup live stream, world cup 2015, world cup fixtures, world cup results, world cup highlights, world cup predictions, world cup odds, world cup Videos, world cup Photos, ICC team rankings

Defending champions India will enter the 11th edition of the ICC Cricket World Cup in second spot behind leaders Australia.

టాప్ లేపుతున్న టీమిండియా.. వరల్డ్ కప్ లో రాణించేనా..?

Posted: 02/02/2015 05:58 PM IST
Team india to enter world cup in second position

ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న 11వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ లో డిపెండింగ్ చాంపియన్ భారత్ రెండో ర్యాంకుతో బరిలోకి దిగనుంది. అయితే రెండో సంఖ్యతో బరిలోకి దిగనున్నా టీమిండియా బ్యాట్స్ మెన్ ప్రపంచ కప్ లో టాపులేపుతారా..? ప్రపంచ కప్ ను తిరిగి నిలబెట్టుకుంటారా..? అన్న ఉత్కంత అందరిలోనూ వుంది. ఎందుకంటే ఇదే ర్యాంకుతో 10వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ బరిలో దిగిన టీమిండియా.. అనూహ్యంగా క్రికెట్ లో విశ్వవిజేతగా నిలిచింది. తాజాగా ప్రపంచ కప్ బరిలో దిగుతున్న టీమిండియా మళ్లీ రెండో ర్యాంకుతో కప్ ను నిలబెట్టుకుంటుందని భారత క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు.

కాగా ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు రెండో ర్యాంక్ దక్కింది. ముక్కోణపు సిరీస్ విజేత ఆస్ట్రేలియా అగ్రస్థానం కైవశం చేసుకుంది. దక్షిణాఫ్రికా మూడో ర్యాంకులో ఉంది. బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా డీవిలియర్స్, హషిమ్ ఆమ్లా మొదటి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. శిఖర్ ధావన్(7), ధోని(8) టాప్ టెన్ కొనసాగుతున్నారు. భారత్ బౌలర్లు ఎవరూ టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేపోయారు. భువనేశ్వర్ కుమార్(13), రవీంద్ర జడేజా(14) మాత్రమే టాప్-20లో ఉన్నారు.

అటు టెస్టు ర్యాంకింగ్ లో భారత్ 7వ స్థానానికి దిగజారింది. కాగా టీ 20లోనూ రెండవ స్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక ప్రధమ స్థానాన్ని అక్రమించుకుంది. ఇక టెస్టు క్రికెట్ లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర టాప్ ర్యాంకులో నిలువగా, భారత ఆటగాళ్లు ఎవ్వరూ టాప్ టెన్ ర్యాంకులలోపు చేరుకోలేదు. విరాట్ కోహ్లీ మాత్రం పన్నెండో స్థానాన్ని ఆక్రమించగా, మురళీ విజయ్, చట్టీశ్వర్ పుజారాలు 24, 26 ర్యాంకులలో కొనసాగుతున్నారు. కాగా టీ 20 పరిమిత ఓవర్ల మ్యాచ్ లోనూ టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ సొంతం చేసుకోగా, 8వ స్థానంలో సురేష్ రైనా, 10వ స్థానంలో యువరాజ్ కొనసాగుతున్నారు.

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్
    
ఆస్ట్రేలియా         52     6254     120
భారత్ (టీమిండియా)     70     8010     114
సౌత్ ఆఫ్రికా      55     6211     113
శ్రీలంక         83     8955     108
ఇంగ్లాండ్         57     5953     104
న్యూ జేఅలాండ్     45     4600    102
పాకిస్తాన్         59     5662     96
వెస్ట్ ఇండీస్     51     4808     94
బంగ్లాదేశ్         33     2466     75
జింబాబ్వే         36     1893     53
ఆఫ్గనిస్తాన్         15     622     41
ఐర్లాండ్         11     377     34

క్రీకెట్ క్రీడాకారుల వ్యక్తిగత ర్యాంకింగ్స్

1 ఎబి డి విలియర్స్    891     దక్షిణాఫ్రికా
2 హషీమ్ ఆమ్లా    867     దక్షిణాఫ్రికా
3 విరాట్ కోహ్లీ       831     భారత్
4 కుమార్ సంగక్కర     823    శ్రీలంక
5 తిలకరత్నే దిల్షాన్    785    శ్రీలంక
6 కేన్ విలియమ్సన్    757    ఆస్ట్రేలియా
7 శిఖర్ ధావన్     725    భారత్
8 ధోనీ        721    భారత్
9 క్వింటన్ డి కాక్    720     దక్షిణాఫ్రికా
10 జార్జ్ బైలీ        717    ఆస్ట్రేలియా

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Rankings  top 10 teams  top 10 players  

Other Articles