Pakistan will beat india in world cup says younis khan

Pakistan will beat India, Pakistan batsman Younis Khan, icc world cup 2015, february 15 match, win against India in Adelaide, world cup in Australia and New Zealand, pakistan, india, younis khan, cricket world cup 2015, group b, adelaide oval, adelaide

Senior Pakistan batsman Younis Khan feels that this year's ODI World Cup will provide the country's cricketers another opportunity to break the jinx of having never beaten India in the quadrennial event.

ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించే సత్తా పాకిస్థాన్ కు వుందా..?

Posted: 01/16/2015 10:24 AM IST
Pakistan will beat india in world cup says younis khan

ప్రపంచకప్‌లో దాయాది దేశం భారత్‌తో జరగనున్న మ్యాచ్ లో టీమిండాయాను ఓడిస్తామని పాకిస్థాన్ క్రికె టర్ యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాను ఓడించేందుకు రానున్న ప్రపంచకప్ తమకు మరో చక్కని అవకాశమని పేర్కోన్నాడు. 1975లో ఐసీసీ ప్రపంచ కప్ ప్రారంభమైన నాటి నుంచి పాకిస్థాన్ టీమిండియాపై గెలుపు నమోదు చేసుకోలేదని, ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ జట్టుకు ఇది కలసివచ్చిన అవకాశమని చెప్పుకోచ్చాడు.

వచ్చే ప్రపంచకప్‌లో ఆడిలైడ్‌లో భారత్‌పై గెలుపొందడం ద్వారా చరిత్రను తిరగరాయగలమన్న విశ్వాసం తనకుందన్నారు. ఇటీవలే తాను అస్ట్రేలియా జట్టుతో టెస్టు క్రికెట్ లో ఆడానని, తన ఆట ముగిసిపోయిందన్న విమర్శలకు తన పరుగులతో సమాధానం చెప్పానన్నారు. తన సెంచరీల వరద ప్రపంచ కప్ లోనూ కొనసాగుతుందని చెప్పాడు. ప్రపంచ కప్ ఢిఫెండింగ్ ఛాంపియన్స్ కు ఈ సారి ఖంగుతినిపిస్తామని యూనిస్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.

అయితే సుమారుగా నాలుగు దశాబ్దాల ప్రపంచ క్రికెట్ చరిత్రలో దాయది దేశం పాకిస్థాన్.. టీమిండియాను ఓడించలేదు. అలాంటిది ఈ సారి టీమిండియాను ఓడించి చరిత్రను తిరగరాస్తామని యూనిస్ ఖాన్ ధీమా వ్యక్తం చేయడం కేవలం ఓటమి భయంతోనేనంటూ భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడ్డుతున్నారు. పాకిస్థాన్ జట్టును భారత్ అలవోకగా ఓడించి మరో మారు ప్రపంచ కప్ ను సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  india  younis khan  icc world cup 2015  

Other Articles