Sachin tendulkar says sarita devi to stay strong

bharat ratna sachin tendulkar, indian former cricketer tendulkar, Rajya sabha MP sachin tendulkar, Indian cricket icon Sachin Tendulkar, cwg silver medalist sarita devi, woman boxer Sarita Devi, sarita devi faces one-year ban, sachin meets sarita devi, sachin encourages sarita to stay strong, indian boxer sarita devi, AIBA, Arjuna Awards, Boxer Sarita Devi, Boxing, International Boxing Association (amateur)

After lending strong support to her cause, Indian cricket icon Sachin Tendulkar met Commonwealth Games silver-medallist woman boxer L Sarita Devi, who is serving a one-year ban for her emotionally-charged protest at the Asian Games

సరితాదేవిని కలసి సంఘీభావం చెప్పిన సచిన్

Posted: 01/15/2015 09:09 PM IST
Sachin tendulkar says sarita devi to stay strong

భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు, భారత రత్న సచిన్ టెండుల్కర్ మాటల మనిషి కాదని, ఏదనా అనుకుంటే దానిని చేతల్లో కూడా చేసి చూపుతాడని ఇప్పటికే పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆయన వున్న ప్రతీ మ్యాచ్ ను వీక్షించే ఆభిమానికి ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ కు పూర్తి ఉచితంగా పంపించేందుకు, అక్కడ టీమిండియా మ్యాచ్ లు సాగినన్ని నాళ్లు ఉండేందుకు హోటల్ తదితర ఏర్పాటు చేసిన ఆయన అభిమానుల పట్ల తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది పనులను చేపడుతన్నారు.

తాజాగా ఆసియా క్రీడల్లో తీవ్ర భావోద్వేగానికి లోనై పతకాన్ని తిరస్కరించిన రజత పతక విజేత బాక్సర్ సరితా దేవికి అండగా నిలచి తన ప్రత్యేకతను మరోమారు చాటుకున్నారు. అయితే మాటలకే కాకుండా స్వయంగా అమెను కలసి మనోధైర్యాన్ని ఇచ్చాడు. రెఫరీల నిర్నయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సరితాదేవి ఏడాది పాటు నిషేదానికి గురికావడంతో అమెను ప్రోత్సహించే పనిలో పడ్డారు సచిన్.. అమెను కలసిన సందర్భంగా సరితా దేవి బహుకరించిన టీ షర్టును తన ట్విట్టర్ పోస్ట్ చేశాడు. నిషేధం వల్ల సరిత ఎంతగానో కుంగిపోయిందని, ఎప్పటికైనా తిరిగి క్రీడలో తన సత్తా చూపాలన్న తపన, ఆశ సరిత కళ్లలో కన్పించాయని, తనకి ఎల్లప్పుడూ విజయం చేకూరాలని సచిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

సచిన్ వంటి క్రికెట్ దిగ్గజం తనకు అండగా నిలబడటం తన మనోధైర్యాన్ని కోండంతలు పెంచిందని, అంత ఉన్నత స్థాయిలోని వ్యక్తి తన పట్ల చూపిన ఔదార్యానికి కృతజ్ఞతలు చెప్పింది భారత్ బాక్సర్ సరితా దేవి. సచిన్ వంటి వ్యక్తులు వారి ఇమేజ్ ను పక్కన బెట్టి.. తన లాంటి క్రీడాకారిణి కి అండగా నిలవడం అభినందనీయమని పేర్కోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  sarita devi  cricket icon  boxer  

Other Articles