India clawed back on the third day of the final test

India score day three fourth test, India score day three, sydney test india vs australia, fouth test day three india score, sydney test day three india score, India dominate aussies bowlers, 2014 australia vs india, 2014 australia vs india fourth test, aussies vs india sydney test 2014

Skipper Virat Kohli and Lokesh Rahul carved out centuries to share the stage with "spidercam" as India clawed back on the third day of the final Test against Australia on Thursday

నిలకడగా రాణిస్తున్న భారత్.. ఫలితం తేలేనా..?

Posted: 01/08/2015 03:34 PM IST
India clawed back on the third day of the final test

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు క్రమంగా రాణిస్తున్నారు. రెండో టెస్టును ఆడుతున్న ఓపెనర్ లోకేష్ రాహుల్ తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు మూడవ రోజున అద్భుతంగా రాణించారు. ఇద్దరు సెంచరీలో చేయడంతో భారత్ కూడా మెరుగైన స్కోరును చేయగలిగింది. రాహుల్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా సెంచరీతో రాణించడంతో చివరి టెస్టు మ్యాచ్ మూడవ రోజు ఆటముగిసే సమయానికి 342 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ 253 బంతులను ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేసి.. అబ్బరుపర్చగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 162 బంతులలో 17 ఫోర్లు సాయంతో సెంచరీ సాధించాడు.

దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు.  ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ.  ప్రస్తుతం విరాట్ (140)  సాహా(14) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. రెండో రోజు వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది.  రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు లభించగా, లయన్ కు ఒక వికెట్ దక్కింది.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  fourth Test  cricket  sydney  

Other Articles