Virat kohli captaincy australia cricketers ian chappell michael clarke controversial comments

virat kohli latest news, virat kohli news, ian chappell news, michael clarke latest news, virat kohli captaincy, virat kohli australia test match, mahendra singh dhoni, virat kohli news, australia test match series

virat kohli captaincy australia cricketers ian chappell michael clarke controversial comments : the australian cricket players ian chappell and michael clarke says controversial comments on virat kohli captaincy.

కోహ్లీది కూడా చెత్త కెప్టెన్సీయే.. ‘కంగారు’ పెడుతున్న కామెంట్లు!

Posted: 01/09/2015 04:38 PM IST
Virat kohli captaincy australia cricketers ian chappell michael clarke controversial comments

టెస్టు ఇన్నింగ్స్’లో ఎక్కువ ఓటములు చవిచూసిన ధోనీ కెప్టెన్సీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో అతగాడు అందరికీ షాక్ తగిలేలా వెంటనే టెస్టుల నుంచి రిటైర్’మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే! పైగా.. సీనియర్ ఆటగాడైన ఇతను కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టంలేక అతడు అలా ప్రకటించాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. ఏదైతేనేం.. ధోనీ అలా రిటైర్’మెంట్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఇక అతని కెప్టెన్సీ స్థానాన్ని కోహ్లీ దక్కించుకున్నాడు. అయితే.. అతను ఆ పదవిని అందుకున్నాడో లేదో.. అప్పుడే విమర్శనాస్త్రాలను అందుకుంటున్నాడు!

తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్’గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విరాట్ కోహ్లీ మీద ఆస్ట్రేలియా దిగ్గజాలు వరుసగా విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. సిడ్నీ టెస్టులో భాగంగా కోహ్లీ అనుసరిస్తున్న వ్యూహాలు, పద్ధతలు చాలా గందరగోళంగా వున్నాయని వాళ్లు ఆరోపించారు. కెప్టెన్’గా బాధ్యతలు నిర్వర్తించడానికి కోహ్లీ సరిపోడని, ఆ వ్యవహారంపై అతనికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వుందని పేర్కొంటున్నారు. కోహ్లీ ఇలాగే వ్యవహరిస్తూ వుంటే.. తోటి ఆటగాళ్లకూ చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇండియా జట్టు డీలా పడిపోతుందని సదరు దిగ్గజాలు అంటున్నారు.

ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజాలు ఇయాన్ చాపెల్, మైకేల్ క్లార్క్.. కోహ్లీ కెప్టెన్సీపై తమ అభిప్రాయాలు తెలిపారు. కోహ్లీ పదేపదే బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్’లో తరచూ మార్పులు చేస్తున్నాడని.. అది బౌలర్లకు తప్పుడు సందేశాన్ని పంపిందని చాపెల్ పేర్కొన్నాడు. అలాగే క్లార్క్ మాట్లాడుతూ.. ఫార్మాట్’కు తగినవిధంగా బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేయడాన్ని కోహ్లీ నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. బౌలర్లను, ఫీల్డర్లను వెనువెంటనే మార్చడం టి20 క్రికెట్’కు సరిపోతుందని.. టెస్టుల్లో అలాంటి ఎత్తుగడలు పనిచేయవని అతడె తెలిపాడు.

ఇదిలావుండగా.. కోహ్లీ వ్యవహరిస్తున్న కెప్టెన్సీ తీరు అంతగా సంతృప్తికరంగా లేదని కొందరు క్రికెటర్లు వాపోతున్నారు. ఒకవేళ ఇతని సారథ్యంలో కూడా భారత్ వరుసగా మ్యాచులు ఓడిపోతే ధోనీలాగే విమర్శలు అందుకోవాల్సి వస్తుందని.. కెప్టెన్సీ నుంచి తొలగిపోవాల్సి వస్తుందని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా కోహ్లీ కోలుకుంటే అతని కెప్టెన్సీకి ఎటువంటి ప్రమాదముండదని హితువులు పలుకుతున్నారు. మరి.. కోహ్లీ ఇకనుంచైనా జాగ్రత్తలు పాటిస్తాడో లేదో చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles