Lokesh rahul hits his maiden test ton

lokesh rahul maiden ton, lokesh rahul latest updates, lokesh rahul latest updates, lokesh rahul latest news, lokesh rahul photos, lokesh rahul in action, lokesh rahul maiden ton creates record, lokesh rahul in world cup squad, India vs Australia fourth test

What a knock by the young chapLokesh Rahul.! He uses 253 balls to reach the landmark, laces with 11 boundaries and a six.

అసీస్ పై తొలి సెంచరీని నమోదు చేసిన రాహుల్

Posted: 01/08/2015 01:42 PM IST
Lokesh rahul hits his maiden test ton

టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ అసీస్ గడ్డపై తన సత్తాను చాటాడు. నెమ్మదిగా నిలదొక్కుకుంటూ తన అద్బుత బ్యాటింగ్ తో టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న చివరి టెస్టులో రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 253 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం పూర్తి చేసి చేసి.. అబ్బరుపర్చాడు. ఆ తరువాత పలు పరుగులు చేసిన లోకేష్ 110 పరుగుల వద్ద తన విక్కెట్ ను కోల్పోయాడు. 46 పరుగుల వద్ద షేన్ వాట్సన్ విసిరిన బంతిని ఆడబోయి.. లోకేష్ బంతి గాల్లోకి అంతెతున ఎగిరింది. విక్కెట్ వెనక్కి వెళ్లిన బంతిని పట్టుకునేందుకు స్లిప్ లో వున్న స్మిత్ పరుగు తీసినా విఫలం చెందాడు.

దీంతో అప్పటి నుంచి అలవోకగా, నెమ్మదిగా అడిన లోకేష్ తొలి సెంచరీని నమోదు చేశాడు. తను ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ చేసిన క్రికెటర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు.  రాహుల్ కు జతగా వున్న విరాట్ కోహ్లీ కూడా పరుగుల పందేరంలో ముందుండి టెస్టుల్లో తన నాల్గవ సెంచరినీ నమోదు చేశాడు. అంతకుముందు రోహిత్ శర్మ(53) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  మూడు రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lokesh rahul  maiden ton  India vs Australia  

Other Articles