Mysterious unrest in indian dressing room at gabba was a kohli dhawan fight

Mysterious unrest in Indian dressing room, indian dressing room Mysterous unrest, Mysterous unrest made lose gabba test, fight between virat kohli and shikar dhawan, Australia, Brisba, Cricket, India, India in Australia 2014-15, Mahendra Singh Dhoni, Shikhar Dhawan, Gabba Test, Virat Kohli, mysterious unrest

This was in reaction to watching Virat Kohli walk out to bat instead of the overnight batsman Shikhar Dhawan on day 4 of the Gabba Test.

వారిద్దరి మధ్య వివాదమే.. బ్రిస్ బేన్ టెస్టు ఓటమికి కారణమైంది.!

Posted: 12/23/2014 03:25 PM IST
Mysterious unrest in indian dressing room at gabba was a kohli dhawan fight

అస్ట్రేలియాతో అతిథ్య జట్టుతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమికి కారణం తెలిసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ లకు మధ్య జరిగిన వివాదమే ఇందుకు అసలు కారణంగా జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అయితే అంతకు ముందే ఆయన తన అందాల ప్రేయసి అందాల అనుష్క శ్మర తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో అందాల ఆరోబోత విషయమై కూడా కొంత అసహనానికి గురయ్యాడని, దానిని కూడా కోహ్లీ ధావన్పై చూపించాడని తెలుస్తోంది. విజయ తీరాలను చేరకుంటున్న క్రమంలో చిన్న చిన్న పోరబాట్లు దొర్లినా.. వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ పరాజయం పాలవుతున్న క్రమంలో ప్రతీ పొరబాటు వివాదానికి దారి తీస్తోంది. అలానే వుంది ప్రస్తుతం భారత్ పరిస్థితి. గాయాలు, ఫామ్ లో లేకపోవడం, ఆటగాళ్ల మధ్య విభేధాలతో టీమిండియా సతమతమవుతోంది.

అస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు టెస్టులు ఓటమిపాలైన భారత్.. టీమిండియా ఆటగాళ్ల మధ్య అంతరాన్ని పెంచుతుంది. బ్రిస్బేన్ లో జరిగిన రెండో టెస్టులో ఇండియా ఓటమికి డ్రెసింగ్ రూమ్ లో జరిగిన ఓ వాగ్వాదమే కారణంగా తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ మూడవ రోజు ఆటలో నాటౌట్ గా వున్న శిఖర్ ధావన్.. నాల్గవ రోజు గాయం కారణంగా బ్యాటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని జట్టు మేనేజ్ మెంట్ కు చెప్పాడు. దీంతో తప్పనిసరి పరిస్థుతుల్లో బరిలో దిగిన కోహ్లీ.. ఆటపై విముఖతతోనే బరిలోకి దిగాడు. కేవలం ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు.

పెవీలియన్ కు చేరుకున్న కోహ్లీ తన అసహనాన్ని ధావన్ పై చూపించాడు. తాను అవుట్ కావడానికి కారణమం ధావనేనని కోహ్లీ నిందించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. నాల్గవ రోజు ప్రారంభ సెషన్ లో బరిలోకి దిగేందుకు జంకే ధావన్ గాయాన్ని సాకుగా చూపాడని ఆరోపించడమే ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దీనికి ధావన్ బదులిస్తూ.. దేశం కోసం ఆడటాన్ని గర్వంగా భావిస్తున్నానని, ఆశించిన స్థాయంలో తన ఆట తీరు లేకపోతే తాను జట్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడని చెబుతున్నాడు. అంతేగాని గాయాలను సాకుగా చూపు తప్పుకోవాల్సిన పరిస్థితి తనకు లేదని తేల్చిచెప్పాడు. దీంతో ఇరువురు మధ్య సుమారు అరగంట వరకు వాగ్వాదం నడిచినట్లు సమాచారం.

ఇరువురు క్రీడాకారుల వివాదం విషయం తెలుసుకున్న టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని వారిద్దరికీ సర్థిచెప్పారని సమాచారం. అయితే కోహ్లీ ఈ తరహాలో ఫైర్ అవ్వడం ఇది మొదటిసారని, ఆయన అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిత్వం వున్నవాడని, కానీ ఎందుకిలా చేశాడో అర్థకావడం లేదంటూ తన సన్నిహితులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే అనుష్క శర్మ అందాల ఆరబోత విషయంలో కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోన్న కోహ్లీ తన అసహనాన్ని ప్రధర్శించినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  shikhar dhawan  india vs australia  test match  

Other Articles