Sunrisers hyderabad win by 15 runs

Mumbai Indians vs Sunrisers Hyderabad Live Score, MI vs SRH Live, Rohit Sharma, Kieron Pollard, Shikhar Dhawan, Aaron Finch, Dale Steyn, Indian Premier League

Mumbai Indians fall again as Sunrisers Hyderabad win by 15 runs

ఎడారిలో ముంబైకి విజయం అందని ద్రాక్షే

Posted: 05/01/2014 11:30 AM IST
Sunrisers hyderabad win by 15 runs

ఢిపెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కి ఎడారి గడ్డ పై తొలి దశ ఐపీఎల్ లో ఒక్క విజయం అంటే ఒక్కటీ దక్కలేదు. ఐదు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ ఖాతా కూడా తెరవ కుండా స్వదేశానికి పయనం అయింది. వరుస ఓటములతో పరువు తీసుకుంది. నిన్న రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన హోరా హోరి పోరులో 15 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇక హైదరాబాద్ సన్‌రైజర్స్ టోర్నీలో రెండో విజయం నమోదు చేసుకొని కాస్త ఊరట చెందింది. వార్నర్ మెరుపు బ్యాటింగ్‌తో పాటు భువనేశ్వర్ బౌలింగ్ జట్టును గెలిపించాయి.  టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. వార్నర్ (51 బంతుల్లో 65; 1 ఫోర్, 4 సిక్స్‌లు), లోకేశ్ రాహుల్ (40 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొలార్డ్ (48 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినా ఆ జట్టు ఓటమినుంచి తప్పించుకోలేకపోయింది. అద్బుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles