Kings xi punjab make it five out of five

Virat Kohli, AB de Villiers, Virender Sehwag, Royal Challengers Bangalore, Kings XI Punjab, George Bailey, Glenn Maxwell, Live Cricket score

Kings XI Punjab cruised to their fifth successive win this season when they defeated Royal Challengers Bangalore by five wickets in Dubai on Monday

ఎడారి గడ్డ పై పంజాబే కింగ్స్

Posted: 04/29/2014 11:07 AM IST
Kings xi punjab make it five out of five

ఒక జట్టేమో ఈ సీజన్లో రాణిస్తున్న జట్టు, మరో జట్టేమో బలమైన బ్యాట్స్ మెన్స్ ఉన్న జట్టు. ఈ రెండు జట్లమధ్య పోటీ జరిగితే హోరా హోరీగా ఉంటుందని ఊహిస్తారు. కానీ అదేమీ జరగలేదు. బ్యాటింగ్ లో విఫలం అయ్యి, ప్రత్యర్థి జట్టు బౌలింగ్ కి బెంబేలెతెత్తిన బెంగుళూరు పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యి, పరాజయాల పరంపరలో హ్యాట్రిక్ సాధించగా, ఎడారి గడ్డ పై జరిగిన మ్యాచ్ ల్లో ఒక్కటి కూడా ఓడి పోకుండా రికార్డు సాధించింది.

టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. గేల్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (4), పార్థివ్ (2)ల వికెట్లతో టాప్ ఆర్డర్‌ను కూల్చి సందీప్ ఆరంభంలోనే చాలెంజర్స్‌ను దెబ్బతీయగా... జాన్సన్ (2/19), రిషి ధావన్ (2/14)లు రెండేసి వికెట్లతో చెలరేగారు. 35 పరుగులతో యువరాజ్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. సందీప్ శర్మ (3/15) అద్భుతమైన బౌలింగ్‌తో బెంగుళూరు నడ్డి విరిచాడు.

రెండు వందల లక్ష్యాన్నైనా అలవోకగా ఛేధించే కింగ్స్ జట్టు ముందు ఉంచిన 125 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులతో ఛేదించింది. మ్యాక్స్‌వెల్ (6) విఫలమైనా... సెహ్వాగ్ (26 బంతుల్లో 32, 4 ఫోర్లు), మిల్లర్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు), చివర్లో రిషి ధావన్ (22 బంతుల్లో 23 నాటౌట్)లు సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. సందీప్‌శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles