India back on top in odi rankings

Australia lost fourth ODI, No1 ranking back to India,

India back on top in ODI rankings .

భారత్ కి మళ్లీ మొదటి స్థానం వచ్చింది.

Posted: 01/24/2014 09:31 PM IST
India back on top in odi rankings

వరల్డ్ ఛాంపియన్స్ అయిన టీం ఇండియా జట్టు ఇటీవలి కాలంలో విదేశీ గడ్డ పై పరాజయాల పరంపర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణాఫ్రికా టూర్లో, ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ టూర్లో కూడా ఓటములు చవిచూస్తున్న ఈ జట్టు న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే ర్యాంకిగ్స్ లో నెం.1 స్థానాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు మళ్ళీ ఆ స్థానాన్ని టీం ఇండియా తిరిగి సంపాదించుకుంది. 118 పాయింట్లతో నెం.1 స్థానంలోకి దూసుకుపోయిన ఆసీస్ జట్టు నేడు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 57 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడంతో పాయింట్ల ప్రాతిపదికన భారత్ కి మళ్ళీ అగ్రస్థానం దక్కింది. రేపు జరగబోయే వన్డేలోనైనా విజయం సాధించి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం రెండో స్థానంలో అస్ట్రేలియా, మూడో స్థానంలో దక్షిణాప్రికా కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles