సచిన్ టెండూల్కర్ తన కెరియర్లో ఆడుతున్న చిట్టి చివరి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి సచిన్ కి ఘనంగా వీడ్కోలు పలికింది. విస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-0 తేడాతో గెలిచింది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన టీం ఇండియా రెండో టెస్టును కూడా సచిన్ సొంత మైదానంలో ఇన్నింగ్స్ 126 పరుగుల భారీ తేడాతో మూడు రోజుల్లోనే గెలిచింది. దీంతో భారత్ సిరీస్ ను 2-0 తో గెల్చుకుంది. తొలి ఇన్నింగ్స్ లో విస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 182 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్ లో కూడా 187 పరుగులు మాత్రమే చేసి భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో (74) పరుగులతో భారీ స్కోరుకు బాటలు వేసిన సచిన్ మిగతా బ్యాట్స్ మెన్స్ పుజారా, రోహిత్ శర్మలు శకాలతో 495 పరుగుల భారీ స్కోరు చేశారు. దీంతో భారత్ కి 303 పరుగుల ఆధిక్యం లభించింది. 43/3 ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 187 పరుగులకు కుప్పకూలింది. భారత స్పిన్నర్లు ప్రజ్ఞాన్ ఓజా, అశ్విన్ విండీస్ పతనాన్ని శాసించారు.
రెండో ఇన్నింగ్స్లో ఓజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాకపోవడంతో మళ్లీ బ్యాటింగ్కు దిగని సచిన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి అభిమానులను అలరించాడు. భారత బౌలర్లలో ఓజా 5 వికెట్లు తీయడగా, అశ్విన్ 4 వికెట్లు తీసి విజయాన్ని అందించారు. ఇక అరంగ్రేట టెస్టులో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం సచిన్ కి ఘనంగా వీడ్కోలు పలికారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more