స్వదేశంలో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్ లో భారత జట్టు పై పర్యాటక జట్టు అయిన ఆస్ట్రేలియా పైచేయి సాధించడంతో టీం ఇండియా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. మూడో వన్డేలో ఒకే ఒక్క ఓవర్ భారత్ విజయాన్ని దూరం చేయడంతో సిరీస్ లో ముందంజ వేయలేక పోయింది. బ్యాటింగులో రాణిస్తున్నా కానీ, ఫేసర్లు స్వదేశీ పిచ్ ల పై రాణించలేక పోవడంతో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. సిరీస్‌లో 1-2 తో వెనుకబడిన ధోని బృందం మరో మ్యాచ్ ఓడితే కోలుకోవడం చాలా కష్టమవుతుంది.
ఇప్పుడు గెలిస్తే... తర్వాతి మూడు వన్డేల్లో ఒక్కటి గెలిచినా సిరీస్ ఆసీస్ సొంతమయ్యే అవకాశం ఉంది. చివరి ఓవర్లలో ఫేసర్లు, బ్యాటింగులో ఓపెనర్లు నిలకడ లేమితో ఉండటంతో ఈ మ్యాచ్ లో భారత్ పై ఒత్తిడి బాగా పెరిగింది. గత మ్యాచ్ అనుభవవాల ద్రుష్ట్యా భారత్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. మూడో వన్డేలో భారీ పరుగులు ఇచ్చిన ఇషాంత్ కి తుది జట్టులో చోటు దక్కితే ఒత్తిడిలో ఉన్న అతను రాణిస్తాడనేది చూడాలి.
అంతంత మాత్రమే రాణిస్తున్న ఇషాంత్, కుమార్ లను పక్కన పెట్టి కొత్త వారైనా ఉనద్కత్, షమీలను తీసుకుంటారా అన్నది చూడాలి.టి20లో అదరగొట్టిన యువీ వన్డేల్లో విఫలం అవుతున్నాడు. అతను ఈ మ్యాచ్ లోనైనా రాణిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ ధోని సొంత మైదానం అయిన రాంచీలో జరగుతున్న వన్డేలో భారత్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more