Mumbai indians make clt20 semis

Mumbai Indians make CLT20 semis , Mumbai Indians,Perth,Rohit Sharma, New Delhi,chennai super kings,Cleveland Indians

Mumbai Indians outclassed Perth Scorchers by six wickets at the Ferozeshah Kotla here Wednesday.

ముంబయి గెలిచెన్... సెమీస్ లో నిల్చెన్

Posted: 10/03/2013 10:05 AM IST
Mumbai indians make clt20 semis

చావో రేవో తేల్చుకోవాల్సిన చాంపియన్స్ లీగ్ టి-20 టోర్నీలో ముంబయి ఇండియన్స్ విజయం సాధించి, సెమీస్కు అర్హత సాధించింది. పెర్త్ స్కార్చర్స్తో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్లో ముంబయి ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించి బెర్తు సొంతం చేసుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి మరో 40 బంతులు మిగిలుండగా అలవోకగా విజయతీరాలకు చేరింది. రోహిత్ శర్మ (24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్), డ్వెన్ స్మిత్ (25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) మెరుపులు మెరిపించారు. పొలార్డ్ 23, అంబటి రాయుడు 14 (నాటౌట్) పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 149 పరుగులు చేసింది. వైట్మన్ (32 బంతుల్లో 51 నాటౌట్) దూకుడుగా ఆడగా, అగర్ (35), కార్ట్రైట్ (28) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో ఒటాగో వోల్‌‌ట్సను రన్‌రేట్‌లో వెనక్కు నెట్టి.... చెన్నై, రాజస్థాన్‌ల సరసన సెమీస్‌కు చేరింది.  ముంబయి బౌలర్లు కల్టర్ నిలె మూడు, ప్రజ్ఞాన్ ఓజా రెండు వికెట్లు తీశారు. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ దక్కింది. ఇక రానున్న మ్యాచ్ ల్లో కూడా ముంబయి రాణించి, సచిన్ కి ఛాంపియన్ లీగ్ టి20 కప్ ని అందిస్తారో లేదో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more