ఇండియా వన్డే జట్టులో పునరా గమనం కోసం ఎదురుచూస్తున్న భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సునామీలా చెలరేగిపోయాడు. వెస్టిండీస్ ఏ జట్టుతో భారత్ అనధికారిక వన్డే సీరీస్ తొలి వన్డేలో 89 బంతులకే 123 పరుగులు చేసిన యువీ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. యువరాజ్ విజృంభణకు యూసఫ్ పఠాన్ తుపాన్ తోడవడంతో నిర్ణీత 42 ఓవర్లలో 312 పరుగులు చేసిన భారత్ ఏ జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టును చాపచుట్టలా చుట్టేసింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో విండీస్ ఏ జట్టు 39.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటయింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన భారత్ ఏ జట్టులో 11 ఓవర్లలోనే ఓపెనర్లు ఆర్వి ఊతప్ప (23), యుబిటి చాంద్ (1) పరుగులతో పెవిలియన్ బాట పట్టారు. చాంద్ ఒక్క పరుగుకే ఔటవడంతో వన్‌డౌన్‌లో బరిలోకి వచ్చిన మన్‌దీప్‌సింగ్ ఊతప్పతో కలిసి నిలకడగా ఆడుతున్న క్రమంలో ఊతప్ప 27 పరుగులకు వెనుదిరిగాడు. 47 పరుగుల స్కోరు వద్ద 12వ ఓవర్లో మన్‌దీప్ సింగ్‌తో జతకలిసిన యువరాజ్ ఆదిలో ఆచితూచి జాగ్రత్త పాటించాడు. 38 బంతుల వరకు స్ట్రోక్ ప్లే జోలికి పోకుండా నింపాదిగా ఆడిన యువరాజ్ తర్వాత 89 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో సహా 123 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చమటలు పట్టించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more