ఒంపిక్స్ లో పతకాన్ని గెలిచి భారత కీర్తిని నలు దిశలా చాటిన మన హైదరాబాద్ బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కెరియర్ లో కలగా మిగిలిన ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిట్ టైలిల్ కి రెండు అడుగుల దూరంలో నిలిచిన సైనా నేడు జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో కొరియా క్రీడా కారిణి అయిన 13 వ సీడ్ యియాన్ బె తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడి కలను కలలాగే మిగిల్చుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో మన దేశానికి చెందిన క్రీడా కారుణులు దూసుకుపోతే నేడు జరిగిన మ్యాచ్ ల్లో మాత్రం సైనా, పారుపల్లి కశ్యప్ ఓడి ఇంటి దారి పట్టారు. ప్రిక్వార్టర్స్‌లో పోరాడి గెలిచిన స్ఫూర్తితో ఈ మ్యాచ్ బరిలోకి దిగిన సైనా 21-23, 9-21 తేడాతో యియాన్ చేతిలో ఓడింది. ఓ దశలో ముందంజలో ఉన్న సైనా ప్రత్యర్ది పుంజుకోవడంతో కోలుకోలేక పోయింది. అటు పురుషుల 13వ సీడ్ పారుపల్లి కశ్యప్ కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో ఓడిపోయాడు. మూడో సీడ్ డు పెంగ్యూతో జరిగిన మ్యాచ్‌లో మూడు గేమ్‌ల పాటు కశ్యప్ పోరాడి ఓడాడు. 21-16, 20-22, 15-21 తేడాతో కశ్యప్‌కు ఓటమి తప్పలేదు. తొలి గేమ్ సునాయాసంగా గెలిచినా.. రెండో గేమ్‌లో కశ్యప్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరికి 20-22 తేడాతో గేమ్ కోల్పోయాడు. మూడో గేమ్‌లోనూ మొదట ఆధిక్యంలోకి దూసుకుపోయినా.. తర్వాత వెనకడుగు వేశాడు. దీంతో ఇండియా క్రీడాకారులు ఇద్దరు ట్నోర్నీ నుండి నిష్ర్కమించారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more