Golden ball for ravindra jadeja

Golden Ball winner Ravindra Jadeja, Golden Ball for Ravindra Jadeja, Ravindra Jadeja, Champions Trophy 2013, ICC Champions Trophy

Golden Ball for Ravindra Jadeja

ప్రతిభ కనబర్చిన రవీంద్ర జడేజా

Posted: 06/25/2013 04:36 PM IST
Golden ball for ravindra jadeja

చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ ప్రతిభ కనబర్చిన రవీంద్ర జడేజా బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో కెరీర్ బెస్ట్ ర్యాంకులు సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీలో తా ను తీసిన 12 వికెట్లతో గోల్డెన్ బాల్ ట్రోఫీని సొంతం చేసుకు న్న జడేజా.. ఇక్కడ విడుదలైన వన్డే ర్యాంకింగ్స్ బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాలు రెండింటిలోనూ మూడో ర్యాంకు చేరాడు. బ్యాటింగ్ విభాగంలోనూ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 52వ స్థానంలో నిలిచాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా తన అగ్రస్థానాన్ని బలోపేతం చేసుకుంది. 119 రేటింగ్ పాయింట్లతో సిరీస్‌లో అడుగుపెట్టిన భారత్.. ఈ విజయంతో 123 రేటింగ్ పాయింట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. ఇక 113 పాయింట్లతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బౌలింగ్ విభాగంలో అశ్విన్ టాప్-10లో తన స్థానా న్ని తిరిగి దక్కించుకున్నాడు. ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానాన్ని సంపాదించాడు. ఇదే విభాగంలో భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ వరుసగా 49, 51వ స్థానాల్లో నిలవగా, వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బ్యాటింగ్ విభాగానికొస్తే కోహ్లీ మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా, ధవన్ 21 స్థానాలను మెరుగుపరుచుకుని 29వ స్థానాన్ని సాధించాడు. అయితే ధోనీ మాత్రం ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more