ఐపీఎల్ లో అత్యధిక రేటు పెట్టి కొన్న ఆటగాడిగా పేరున్న రవీంద్ర జడేజా, పైసలకు తగ్గేట్లే తన ఆటను ప్రదర్శిస్తున్నాడు. మైదానంలో ఆలౌరౌండ్ ప్రతిభను కనబరుస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చెన్నైకి కీలక విజయాలు అందించిన జడేజా నిన్న రాత్రి కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో చెన్నై కోల్ కత్తాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కత్తా బాట్స్ మెన్స్ ని చెన్నై బౌలర్లు దెబ్బతీయడంతో 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే చెన్నై ముందు ఉంచింది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ (19 బంతుల్లో 25; 5 ఫోర్లు)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన యూసుఫ్ పఠాన్ (22 బంతుల్లో 25; 4 ఫోర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ దశలో హస్సీ ఓ అద్భుతమైన క్యాచ్‌తో గంభీర్‌ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన వారు ఒక్కరు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. మనోజ్ తివారీ (18 బంతుల్లో 13), దేబబ్రత దాస్ (15 బంతుల్లో 19; 2 సిక్సర్లు) కాసేపు పోరాడినా లోయర్ ఆర్డర్ నుంచి సహకారం లభించలేదు. దీంతో స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది.
ఈ లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలో దెబ్బ పడ్డా జడేజా పోరాటంతో 4 వికెట్ల తేడాతో గెలిచింది. చెన్నై బ్యాట్స్ మొదట్లో తడబడ్డారు. టాప్ ఆర్టర్ వికెట్లు త్వరగా పడిపోవడంతో చెన్నై ఓ దశలో 54 పరుగులకే 4 వికెట్లు పోయి కష్టాల్లో పడింది. మైక్ హస్సీ (51 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్సర్) నిలకడగా ఆడగా... జడేజా (14 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. దీంతో చెన్నై గెలుపు సులువు అయింది. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more