సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు పిచ్‌లను తనిఖీ చేసేందుకు వచ్చిన ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్ గ్రౌండ్ అండ్ పిచ్ కమిటీ చైర్మన్ చేతన్ చౌహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. చౌహాన్‌ను పిచ్‌పైకి రానీకుండా ఐఎంజీ అధికారి పీటర్ గ్రిఫిత్ అడ్డుకున్నారు. ఫిరోజ్ షా కోట్ల మైదానం అన్ని ఏరియాల్లో తిరిగేందుకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసినా పిచ్‌ను చూసేందుకు మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్‌ను జీఎంఆర్ సీనియర్ అధికారి సునీల్ వాల్సన్, డేర్‌డెవిల్స్ మెంటర్ టీఏ శేఖర్ శాంతపరిచేందుకు ప్రయత్నం చేశారు. పాస్‌లు జారీ చేయడంలో పూర్తి అధికారమున్న సుందర్ రాజన్‌తో మాట్లాడాల్సిందిగా ఆయనను కోరారు. ‘సుందర్ రాజన్తోనో లేక నా సొంత అసోసియేషన్‌లో అడుగుపెట్టేందుకు అడ్డుకున్న విదేశీయుడి (పీటర్)తోనో నేను ఎందుకు మాట్లాడాలి. ఇక్కడ షో నడిపేది నేను. మీరు కాదు’ అని చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు సంఘీభావంగా గ్రౌండ్స్‌మెన్ మైదానం విడిచి వెళ్లారు. అలాగే సెంటర్ వికెట్‌పై ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లపై చౌహాన్ విరుచుకుపడ్డారు. అలా చేస్తే ప్లేయింగ్ ఏరియా దెబ్బతింటుందని వారించారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more