పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ జషన్ అబ్బాసి మంచినీళ్లు అనుకొని తక్కువ గాఢత కలిగిన ఫినాయిల్‌ను పొరపాటున తాగాడు. బెంగళూరులో అంధుల ప్రపంచకప్‌లో పాల్గొంటున్న పాక్ జట్టు విడిది చేసిన హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. హోటల్ గదిలో అబ్బాసీ అల్పాహారం తీసుకునే సమయంలో టేబుల్‌పై ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌ను మినరల్ వాటర్‌గా భావించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. గదిని శుభ్రపరిచే సిబ్బంది తమ పని పూర్తి చేశాక ఫినాయిల్ బాటిల్‌ను అక్కడే మరచిపోవడం ఇందుకు కారణం.
ఈ విషయం తెలియగానే టోర్నీ నిర్వాహకులు అతనిని ఎమ్‌ఎస్ రామయ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉండటంతో సాయంత్రం ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఈ అంశంపై హోటల్ యాజమాన్యం లిఖిత పూర్వకంగా క్షమాపణలు తెలిపిందని అఖిల భారత అంధుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎస్‌పి నగేష్ తెలిపాడు. అయితే, బాధ్యులపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించామని చెప్పాడు.
కాగా, యాదృచ్చికంగా జరిగిన ఒక సంఘటన భారత్-పాక్ క్రికెట్ సంబంధాలకు అవరోధంగా మారకూడదని పాక్ జట్టు మేనేజర్ సుల్తాన్ షా అభిప్రాయం వ్యక్తం చేశాడు. టోర్నీని మెరుగ్గా నిర్వహిస్తున్నారని అతను అన్నాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more