భారత క్రికెట్ ఆటగాళ్ళ పేవల ప్రదర్శన మరోసారి బయటపడింది. పోయిన సంవత్సరం ఇంగ్లాండ్ చేతితో క్లీన్ స్విప్ అయినా ఇండియా ఆటగాళ్ళ ఆటలో మాత్రం మార్పురాలేదనిపిస్తుంది. మొదటి టెస్టులో ఏదో ఊరించి, రెండో టెస్టు నుండి షరా మామూలు అన్నట్లుగానే ఆడుతున్నారు. సొంత గడ్డ పై ఇప్పటికే రెండో టెస్టులో ఓటమి పాలై, కనీసం మూడో టెస్టులోనైనా పుంజుకుంటారని అనుకుంటే.... పుంజుకోవడం కాదు కదా ? పేవలమైన ఆటతీరును ప్రదర్శించి పరాజయం అంచుల వరకు వెళ్లారు. మొదటి ఇన్నింగ్స్ లో 316 పరుగులకే ఆలౌటైంది. బౌలింగులోనైనా ప్రతాపం చూపుతారనుకుంటే కావాల్సినన్నీ పరుగులు సమర్పించుకొని, 523 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి నిలకడగా ఆడుతారనుకుంటే.... దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన సెహ్వాగ్ , గంభీర్ లు లంచ్ వరకు బాగానే ఆడారు. లంచ్ విరామం తరువాత వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. లంచ్ విరామానికి 86 పరుగులకు వికెట్ కోల్పోకుండా ఆడిన మనవాళ్లు, లంచ్ తర్వాత తొలి బంతికే సెహ్వాగ్ అవుట్ కావటంతో వికెట్ల పతనం మొదలైంది. ఆ వెంటనే పుజారా రన్ అవుట్ కావటం ఆ తర్వాత గంభీర్, సచిన్, యువరాజ్, ధోనీ కూడా క్యూ కట్టారు. దాంతో 180 పరుగలకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమికి మరింత దగ్గరైంది. బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 80 పరుగులతో అజేయంగా నిలవడంతో, 239 పరుగులకు చేరుకుంది. మొత్తానికి ఈడెన్ మ్యాచ్ ని కూడా భారత్ ఇంగ్లాండ్ కి సమర్పించుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more