ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కంటే, ఆగ్రహంతో ఉన్న భార్యను సముదాయించడమే కష్టమని సచిన్ తెండూల్కర్ జోక్ చేశాడు. గత రాత్రి ముంబాయ్ లో ద్వారకానాథ్ సాంజిగిరి రాసిన మరాఠీ పుస్తకం ‘సంవాద్ లెజెండ్స్ షి’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు చేప్పాడు. నిప్పులు చెరిగే బంతులు వేసే ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కోవడం కష్టమా లేక కోపంతో ఉన్న భార్యనా అని ఓ విలేఖరి ప్రశ్నించినప్పుడు సచిన్ సరదాగా స్పందించాడు. ‘ఇప్పటికే నన్ను ఇరకాటంలో నెట్టారు. ఇప్పుడు నేను ఇంటి వద్ద లేను కాబట్టి ధైర్యంగా ఓ మాట చెప్తాను. కోపంతో ఉన్న భార్యతో వేగడమే కష్టం’ అని చమత్కరించాడు.
తనను మొదటి నుంచి ఎంతో ప్రోత్సహించిన తల్లి, తండ్రి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల గురించి సచిన్ పలు విషయాలను ప్రస్తావించాడు. వారి సహకారం లేకపోతే తాను క్రికెట్‌లో ఎదిగే వాడిని కానని స్పష్టం చేశాడు. భార్య అంజలి అన్నివిధాలా సహకరించడంతోనే తాను స్వేచ్ఛగా క్రికెట్ ఆడగలుకుతున్నానని చెప్పాడు. కుటుంబం, పిల్లల వ్యవహారాలన్నీ ఆమే చూసుకుంటున్నదని అన్నాడు.
అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో సచిన్ మాటలు ఇలాఉన్నాయ్.. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సిసిఐ) సహకారంతోనే తాను క్రికెటర్‌గా ఎదిగానని సచిన్ అన్నాడు. బ్రబౌర్న్ స్టేడియం నిర్మించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్‌ను సిసిఐ ఘనంగా సన్మానించింది. సిసిఐలోనే తాను స్థానిక టోర్నమెంట్స్ ఆడానని, అప్పట్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసుగల క్రికెటర్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రవేశం ఉండేది కాదని సచిన్ తెలిపాడు. అయితే, మాధవ్ ఆప్టే, రాజ్ సింగ్ దుంగార్పూర్ 14 ఏళ్ల తనను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించేందుకు సిసిఐ నిబంధనలనే మార్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పడు. సిసిఐతో జరిగిన ఒక మ్యాచ్‌లో తాను ఆప్టే, దుంగార్పూర్ వంటి మేటి ఆటగాళ్లను ఢీకొన్నట్టు చెప్పాడు. సిసిఐ తనను ఎంతో ప్రోత్సహించిందని, ఇప్పుడు తాను ఈస్థాయికి చేరుకోవడానికి పునాది వేసిందని తెలిపాడు. సిసిఐతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more