టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఓపెనర్ వీరేందర్ సెవాగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి మధ్య చాలాకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. బిసిసిఐ అధికారుల జోక్యంతో పరిస్థితి కుదుటపడుతున్నదని అనుకుంటున్న సమయంలోనే సెవాగ్ మళ్లీ తన మాటల యుద్ధానికి తెరతీశాడు. 2007లో టి-20 ప్రపంచ కప్, 2011లో వరల్డ్ కప్ ట్రోఫీలను టీమిండియా సాధించడంలో ధోనీ పాత్రపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, బలమైన జట్టే కెప్టెన్‌కు వరమని వ్యాఖ్యానించాడు. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టు పటిష్టంగా ఉందని, కాబట్టి వరల్డ్ కప్ విజయాన్ని ధోనీ ఒక్కడిదే కాదన్న విషయాన్ని గమనించాలని మాజీ వికెట్‌కీపర్ సాబా కరీం నిర్వహిస్తున్న ‘జెనిసిస్ ప్రొ-క్రికెట్ సెంటర్’కు వచ్చిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సెవాగ్ వ్యాఖ్యానించాడు. ధోనీకి బలమైన జట్టు అండగా ఉందని చెప్పాడు.
అలాంటి జట్టు ఉంటే కెప్టెన్ ఎవరైనా ఉత్తమ ఫలితాలనే రాబడతాడని అన్నాడు. ధోనీ నాయకత్వానికి జట్టు మొత్తం మద్దతు పలికిందని పేర్కొన్నాడు. కాబట్టి, ప్రపంచ కప్ విజయాన్ని ధోనీ ఒక్కడి ఘనతగా అనుకోరాదని అన్నాడు. ఒక ప్రశ్న సమాధానమిస్తూ, ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక టూర్‌కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తనకు ఫిట్నెస్ సమస్యలు ఏవీ లేదని స్పష్టం చేశాడు. వెస్టిండీస్ పర్యటనలో భారత ‘ఎ’ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిందని వ్యాఖ్యానించాడు. కొంతమంది సీనియర్లు కూడా అలాంటి జట్టులో ఉంటే బాగుంటుందని సూచించాడు. తా టీమిండియాలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న రోజుల్లో కూడా భారత్ ‘ఎ’ తరఫున పర్యటించానని గుర్తుచేశాడు. దీనివల్ల తగినంత ప్రాక్టీస్ లభిస్తుందని, యువ క్రికెటర్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం సాధ్యమవుతుందని సెవాగ్ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్నదని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలను సెవాగ్ తోసిపుచ్చాడు. క్రికెటర్లు చాలా మంది వనే్డ, టి-20 ఫార్మెట్స్ నుంచి రిటైరైనప్పటికీ టెస్టుల్లో కొనసాగడాన్ని గమనించవచ్చని చెప్పాడు. కానీ, టెస్టులకు గుడ్‌బై చెప్పి వనే్డ లేదా టి-20 ఫార్మెట్స్‌లో ఆడుతున్న వారు ఉండరని అన్నాడు.
ఏ టూర్‌లో పాల్గొనాలి? ఏ టూర్ నుంచి విశ్రాంతి తీసుకోవాలి? అన్న విషయాల్లో సొంత నిర్ణయం తీసుకునే అవకాశం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్‌కు ఇవ్వాల్సిందేనని సెవాగ్ పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కు అపారమైన సేవలు అందించిన 39 ఏళ్ల సచిన్‌కు ఎప్పుడు ఏ టూర్ నుంచి విశ్రాంతి తీసుకోవాలో బాగా తెలుసునని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటాడని సెవాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more