కెప్టెన్సీపై నిరాసక్తతేమీ లేదని భారత క్రికెట్ జట్టు సారథి ఎంఎస్ ధోని స్పష్టం చేశాడు. భవిష్యత్ నాయకుడు ఎవరనేది సెలక్టర్లు చూసుకుంటారని చెప్పాడు. ‘ఫలానా వ్యక్తి నా వారసుడంటూ చెప్పడం నాకిష్టం లేదు. అసలది నాకు సంబంధంలేని విషయం. సెలక్టర్లు చూసుకుంటారు. నా దృష్టిలో మాత్రం కెప్టెన్‌గా నాకే ఓటు వేసుకుంటాను. పోటీగా తీసుకుంటే సెహ్వాగ్, గంభీర్, కోహ్లి ఉంటారు’ అని బారాముల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ని సందర్శించిన ధోని తెలిపాడు. టెస్టు కెప్టెన్సీ ఇస్తే తీసుకుంటానని ఇటీవల గంభీర్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఉధంపూర్‌లోని నార్తర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ను ధోని సందర్శించి అక్కడి అధికారులతో పాటు జవాన్లతో సంభాషించాడు. వారి పిల్లలతో ఉల్లాసంగా గడిపి ఆటోగ్రాఫ్‌లిచ్చాడు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన ధోని రెండు రోజుల పాటు సరిహద్దు సైన్యంతో గడిపాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more