Land registration papers missing how

Land Registration papers missing

Land Registration papers missing ? how ?

భూమి పత్రాలు పోతె ఎలా ?

Posted: 04/29/2013 08:54 PM IST
Land registration papers missing how

నేను రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం గ్రామపంచాయతీ లేఅవుట్‌లో ఉన్న ఒక ప్లాట్ కొనుగోలు చేసి, రిజిస్టర్ చేయించుకున్నాను. అందులోనే ఇల్లు నిర్మించుకుని, అక్కడే నివాసం ఉంటున్నాను. అయితే 8 మాసాల క్రితం నా రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ ఎక్కడో పడిపోయాయి. కాక పోతే వాటి జిరాక్స్ పేపర్స్ మాత్రం నా వద్ద ఉన్నాయి. ఇటీవల అంటే 15 రోజుల క్రితం ఇసి తీయిస్తే ఇప్పటికీ అది నా పేరు మీదే ఉంది. ఇప్పుడు నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్, గిఫ్ట్‌డీడ్ లేదా జిపిఎ చేయించుకోవచ్చా? ఆ మేరకు బ్యాంక్‌నుంచి రుణం పొందే అవకాశం ఉంటుందా? మునుముందు ఎప్పుడైనా నా ఇల్లు అమ్ముకుంటే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? ఈ సమస్యకు సరియైన పరిష్కారం సూచించండి.


మీరు కొన్న ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ పోయినంత మాత్రాన మీరు ఆంధోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే, ఎవరైనా ఇలా, తాము కొనుగోలు చేసిన స్థిరాస్థికి సంబంధించిన దస్తావేజులను కోల్పోయిన ప్పుడు, వెంటనే, ఆ విషయాలన్నీ, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు ఇవ్వడం తప్పనిసరి. అందులో పోయిన ఆ డాక్యుమెంట్లను తిరిగి తమకు అప్పగించమని కోరాలి. అదే సమయంలో, ఆ విషయాన్ని ఎక్కువ సర్కులేషన్‌గల ఒక స్థానిక వార్తాపత్రికలో ఒక ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది. అందులో తమ ఒరిజన ల్ దస్తావేజులు పోయినట్లుగా, ఎవరికైనా అవి దొరికినట్లయితే, వాటిని తిరిగి తమకు అప్పగించవలసిందిగా కోరాలి.

అందుకు విరుద్ధంగా ఆ దస్తావేజుల ఆధారంగా, వేరే వ్యక్తులు ఎవరైనా ఆ ఆస్తిని ఆక్రమించడం గానీ, లేదా ఏదైనా ఒక చార్జి క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం గానీ చేస్తే, అలాంటి ప్రయత్నాలు చెల్లనేరవని, వారు చేసే చర్యలకు తాము బాధ్యులం కాదని, తెలియ పరుస్తూ ఒక ప్రకటన ఇవ్వవలసి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల మునుముందు జరగబోయే పరిణామాలకు, చర్యలకు మీరు బలికాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఏమైనా మీ ఒరిజినల్ దస్తావేజులు పోయినంత మాత్రాన మీ యాజమాన్యపు హక్కులకు, ఏ విధమైన భంగమూ ఏర్పడదు. మీ ఒరిజినల్ సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీల ఆధారంగా, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, సర్టిఫైడ్ కాపీని పొందండి.

దాని ఆధారంగా మీరు మీ భార్యకు, గిఫ్ట్ డీడ్ గానీ, జిపిఏ గానీ ఇవ్వవచ్చు. కాకపోతే, గిఫ్ట్ పొందిన మీ భార్యగానీ, లేదా స్వయంగా మీరే గానీ, బ్యాంకు నుంచి రుణం పొందాలనుకున్నప్పుడు ఒరిజినల్స్ విషయంలో బ్యాంక్ వారు కొంత పేచే పెట్టే అవకాశం ఉంది.

కానీ, మీ ఒరిజినల్స్ పోయిన విషయమై, మీరు పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు ఇచ్చినట్లుగా, అలాగే వార్తా పత్రికలో కూడా ప్రకటన ఇచ్చినట్లుగా వాటి ప్రతులను చూపాలి. అలా చేస్తే, రుణం తీసుకోవడానికి మిగతా అన్ని అర్హతలు సక్రమంగానే ఉన్నప్పుడు, బ్యాంకు వారు మీ నుండి, ఇండెమ్నిటీ బాండ్ గానీ, మరేదైనా అఫిడవిట్ గానీ, తీసుకుని, మీ పేరిట, లేదా, మీ భార్య పేరిట తప్పనిసరిగా రుణం మంజూరు చేస్తారు. కాకపోతే చేయవలసిన వాటిలో ఏదో తప్పిపోకుండా అన్నీ సంపూర్ణంగా పూర్తి చేయడం తప్పనిసరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles