Case file on wife

case file on wife

case file on wife

భార్యపై కేసు పెట్టవచ్చ్చా

Posted: 04/09/2013 12:26 PM IST
Case file on wife

మాది ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను తాగుడు వ్యసనానికి బానిసనై చావు బతుకుల మధ్య ఉంటే మంగళసూత్రాలు అమ్మి నన్ను బతికించింది. తనను సరిగ్గా చూసుకోవడం లేదని, పెద్దమనుషుల తో పంచాయితీ పెట్టించింది. ఇప్పుడు పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. విడాకాలు ఇచ్చింది. నేను తాగుడును వదల లేకపోతున్నాను. నా భార్య తిరిగి రావాలంటే ఏం చేయాలి? ప్రేమించి పెళ్లిచేసుకున్న నన్ను వంచించి మరొకరితో కాపురం చేస్తుంది. ఆమె పై కేసు పెట్టవచ్చా?


మీ ఉత్తరం మీరు భార్యను ఎంతగా వేధించారో స్పష్టం చేస్తున్నది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను ప్రేమగా చూసుకున్నారా? తాగుడు వ్యసనంతో మీ జీవితాన్ని నరకం చేసుకోవడమే కాకుండా భార్యపిల్లలను చూసుకోవల్సిన బాధ్యతను విస్మరించారు. మీ చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కనీసం ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. విడాకులు తీసుకున్నారు కాబట్టి మరోవ్యక్తితో కలిసి జీవించే హక్కు మీ భార్యకు ఉంది. ఆమె తిరిగి వచ్చి మీతో కాపురం చేయాలని కోరడం మీ అవివేకం. ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుని తాగుడు వ్యసనాన్ని వదిలివేసి మరో పెళ్లి చేసుకోండి.

మహిళల రక్షణ కోసం, పిల్లల సంరక్షణ కోసం, సమాజం సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. అయితే ఈ చట్టాలు తమకు ఎలాంటి రక్షణ ఇస్తాయో చాలా మందికి అవగాహన లేదు. చిన్నచిన్న సమస్యలు సర్దుకు పోవచ్చు.. కాని జీవించడమే సమస్యగా మారినప్పుడు, హక్కు లకు భంగం వాటిల్లి నప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించక తప్పదు. మీ సమస్య జీవన్మరణ సమస్య అయితే చట్టం ద్వారానే మీ హక్కులు పరిరక్షించబడుతాయని మీరు భావిస్తే.. మీ సమస్యను మాకు తెలియ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles