కేవలం టాలీవుడ్ నే టార్గెట్ చేస్తూ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారంటూ తెలంగాణ ఎక్సైజ్ శాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలువురు ప్రముఖులు. వాళ్లకీ కుటుంబాలు ఉంటాయని, వార్తలు ప్రచురించే ముందు కాస్త ఆలోచించండంటూ మీడియాకు విజ్నప్తి చేస్తున్నారు. సిట్ విచారణ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఆగష్టు 2వరకు ఎవరికీ ఎలాంటి నోటీసులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. అయితే తర్వాత కూడా అది జరగకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.
సిట్ ఫస్ట్ లిస్ట్ లో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి, వారందరినీ విచారిస్తోంది. ఈ మధ్యలో వారి నుంచి సేకరించిన సమాచారంతోనే రెండో జాబితాను కూడా తయారు చేసిందంట. ఇందులో అందరి నుంచి కామన్ గా వినిపించిన ఓ అగ్రనిర్మాత కుమారుల పేర్లు, మరో హీరో, ఇద్దరు టాప్ హీరోయిన్లు, సాంకేతిక నిపుణుల పేర్లు కూడా ఉన్నట్లు లీకులు అందాయి. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పలువురు సినీ పెద్దలు రంగంలోకి దిగారు.
ఇంతకు ముందు ధైర్యంగా విచారణ జరపండంటూ చెప్పిన అదే పెద్దలు సినీ పరిశ్రమ పరువు మరింత దిగజారకుండా ఉండాలంటే రెండో జాబితా నోటీసులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారంట. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే ఓ బడా నిర్మాతతో పాటు, గతంలో హీరోగా, ఇప్పుడు విలన్ గా వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పిస్తున్న నటుడు పరిశ్రమ తరఫున ప్రభుత్వంతో రాయబారం నడపినట్లు భోగట్టా. తదుపరి విచారణే జరిగితే మాత్రం టాలీవుడ్ మరింత దిగజారుతుందని, ఇండస్ట్రీలో పని చేసేవాళ్ల మనోస్ధైర్యం దెబ్బతింటుందని వీరు చర్చించినట్టు తెలుస్తోంది.
దీంతో టీఆర్ఎస్ సర్కారు మెత్తబడినట్టు సమాచారం. ఒకవేళ విచారణ కొనసాగినప్పటికీ లీకులు గీకులు లేకుండా ముందుకు సాగాలని టాలీవుడ్ తరపున రిక్వెస్ట్ వెళ్లిందంట.ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం నుంచి కొన్ని సంకేతాలు వెళ్లగా, ఇకపై నోటీసులు వెళ్లటం కొంచెం అనుమానమే అనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more