కమల్ ‘పొలిటికల్ ఎంట్రీ’కి ఇది కరెక్ట్ టైమేనా? | Correct time for Kamal Haasan Political Entry.

Kamal haasan political entry soon

Kamal Hassan, Kamal Hassan Political Party, Kamal Hassan Politics, Kamal Hassan Supporters, Kamal Hassan Political Entry, Kamal Hassan New Party, Kamal Hassan Tamil Nadu Politics

Kamal Hassan arranged a closed-door meeting with his fans and supporters at his residence in Alwarpet in Chennai. If sources are to be believed, the majority of the fans had openly asked him to enter into politics. Although there is no official announcement made by Kamal Haasan.

కమల్ రాజకీయ ఆరంగ్రేటం త్వరలోనే...

Posted: 03/06/2017 12:26 PM IST
Kamal haasan political entry soon

అమ్మ చావు తర్వాత తమిళ రాజకీయాల్లో రోజుకో కొత్త మలుపు.. సరికొత్త ట్విస్ట్ లే దర్శనమిస్తున్నాయి. కాంట్రవర్సీలతో వేడేక్కిస్తున్నాయి. ఆ మధ్య రజనీ ఆల్ మోస్ట్ రాజకీయాల్లోకి వచ్చేశాడంటూ చెప్పుకురాగా, ఇప్పుడు లోకనాయకుడు కమల్ పొలిటికల్ ఆరంగ్రేటంకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. పరిస్థితులు ఇంకా పూర్తిగా సర్దుమణగని తరుణంలో, ఆయన ఆలోచనలు రాజకీయాలపైకి మళ్లాయని విశ్లేషకులు చెబుతున్నారు.

తన అభిమాన సంఘాల నేతలతో ఆయన నిన్న సుదీర్ఘంగా సమావేశం అయిన ఈ విషయమై ఓ నిర్ణయం త్వరలోనే ప్రకటించబోతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత కమలహాసన్ వ్యవహారశైలిలో ఊహించని మార్పులు వచ్చాయి. ఎప్పుడూ రాజకీయాల జోలికి పోని ఈ విలక్షణ నటుడు జల్లికట్టు కోసం తన గొంతుకను కమల్ వినిపించారు. అంతేకాదు, పన్నీర్ సెల్వంను సీఎం పదవి
నుంచి దింపడం, శశికళ ముఖ్యమంత్రి కావడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో, కమల్ తనదైన శైలిలో తీవ్రంగా స్పందించారు.

తమిళ రాజకీయాలపై పూర్తిగా విసుగు చెందానని, ఈ దేశాన్నే విడిచి వెళ్లిపోతానని ఓ సందర్భంగా కమల్ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. వాస్తవానికి తమిళనాడులో ఉండటానికే కమల్ ఇష్టపడరట. అలాంటి వ్యక్తి, ఇప్పుడు రాష్ట్ర పరిణామాలపై అనునిత్యం స్పందిస్తున్నారు. ఆయనలో వచ్చిన ఈ మార్పును చూసి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మార్పు వెనక ఓ బలమైన లక్ష్యం ఉందని భావిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడన్న సంకేతాలు అందుతున్న నేపథ్యంలో విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.

కమల్ లాంటి క్రేజ్ ఉన్న హీరో రాజకీయాల్లోకి రావటానికి ఇదే సరైన సమయం అని వారు సూచిస్తున్నారు. చిరంజీవి, విజయ్ కాంత్ ల ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కమల్ విషయంలో తక్కువగా ఉందని, పైగా తమిళనాడు రాజకీయాలు ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలోనే సమస్యలపై ఉన్నది ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసే కమల్ కు ప్రజల సానుకూలత దక్కటం పెద్ద సమస్య కాదన్నది వారి అభిప్రాయం.

ఇక ఆదివారం ఏకంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు తన అభిమాన సంఘాల నేతలతో కమల్ సుదీర్ఘ మంతనాలు సాగించారు. దీనికి కమల్ ఫ్యాన్స్ సంక్షేమ సంఘం నేతలు, సంఘానికి చెందిన న్యాయవాదులు కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం, తమిళనాడులోని సమస్యలన్నింటినీ తొలగించాలంటూ ప్రభుత్వానికి కమల్ అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, బీజేపీ, కాంగ్ నుంచి ఆహ్వానం అందుతున్నప్పటికీ కమల్ మాత్రం కొత్త పార్టీ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Kamal Hassan  Political Entry  Tamil Nadu Politics  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more