కరెన్సీ కష్టాలు సినిమా ఇండస్ట్రీని తెగ ఇబ్బందులకు గురి చేస్తుంది. షూటింగ్ ల పరంగానే కాదు, నోట్లు మార్చుకునేందుకు వీలు లేకుండా కొత్తగా కండిషన్లు పెట్టడంతో అవి మరింతగా ముదిరాయి. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు సైతం దాచుకున్న సొమ్మును ఎలా మార్చుకోవాలో తెలీక ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు.
అయితే తోటి హీరోహీరోయిన్లతో పార్టీలంటూ రచ్చ చేసే ఓ యంగ్ హీరో మాత్రం పాతిక కోట్ల పాత నోట్లతో తెగ ఇబ్బందులు పడుతున్నారంటూ గత వారం రోజులుగా ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రాను రాను నిబంధనలు మరింత కఠిన తరం అవుతుండటంతో అతని పని కుడితో పడ్డ ఎలుక తీరు అయ్యిందని అంతా గుసగుస లాడుకున్నారు.
కానీ, ఇల్లీగల్ దారుల పుణ్యామాని ఆ నల్ల డబ్బంతా ఇప్పటి్కే వైట్ అయిపోయిందని తాజా సమాచారం. మధ్యవర్తిల సహాకారంతో కమీషన్ కూడా ముట్టజెప్పి ఈ పని చేశాడంట. అయితే బయట 20, 30 శాతం కమీషన్ దందా నడుస్తుంటే, అతగాడు మాత్రం బేరాసారాలకు దిగి మరీ 18 శాతం కమీషన్ తోనే తన పాత నోట్లను మార్చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. దీంతో ఇలా నోట్ల సమస్యతో సతమతమవుతున్న మరికొందరు కూడా అతనిని సంప్రదిస్తున్నారంట. ప్రస్తుతం ఆ యంగ్ హీరో ఫోన్ ఆ కాల్స్ తోనే తెగ బిజీ అయిపోయిందని భోగట్టా. ఇంతకు ముందు ఇదే రీతిన కమీషన్ అడటంతో, అందుకు ఓ స్టార్ హీరోయిన్ ససేమీరా అనటం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more