బాహుబలికి మిస్... బాలయ్యకి యస్? nathan jones not in

Nathan jones not in gauthamiputra satakarni

Nathan Jones in Bala Krishna Movie, Gauthamiputra Satakarni Hollywood Villian, Hollywood villian for balayya

Nathan Jones in Bala Krishna Gauthamiputra Satakarni is just a rumour.

బాహుబలికి మిస్సయినా....

Posted: 07/08/2016 01:37 PM IST
Nathan jones not in gauthamiputra satakarni

బాలయ్య వందో చిత్రం గౌతమ పుత్ర శాతకర్ణి భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ కోసం జార్జియాలో తలమునకలై ఉన్నారు. అదే సమయంలో అన్ని భాషల్లో ప్రాధాన్యం ఉన్న నటులను, టెక్నిషియన్లను వాడుకోవటం ద్వారా అందరి దృష్టి ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం హేమామాలిని, కబీర్ ఖాన్ లాంటి పాపులర్ నటీనటులను అల్రెడీ తీసేసుకున్నాడు కూడా. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం ఇందులో హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ కూడా నటించబోతున్నాడన్న వార్త హల్ చల్ చేస్తోంది.

ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్టార్ నటుడు బ్లాక్ బస్టర్ చిత్రాలైన 'ట్రాయ్', 'మ్యాడ్ మాక్స్ ప్యూరి రోడ్' లలో నటించాడు. గతేడాది తమిళంలో బాక్సింగ్ నేపథ్యంలో జయం రవి హీరోగా వచ్చిన 'భూలోగం' అనే సినిమాలో విలన్ గా నటించాడు. అంతేకాదు ఆ మధ్య  'బాహుబలి-2'లో ఓ కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చినా అవి నిజం కాదని రాజమౌళి ఖండించాడు. ఇక ఇప్పుడు బాలయ్యకి విలన్ కి ఆయన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..

ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న క్లైమాక్స్ షూటింగ్ లో 48 ఏళ్ల జోన్స్ పాల్గొనబోతున్నాడంట. ప్రపంచాన్ని జయించాలన్న ఆశయంతో వరుస దండయాత్రలు చేసే గ్రీకు రాజుగా కనిపించనున్నట్లు చెబుతున్నారు. అతనికి శాతకర్ణికి అదేనండీ బాలయ్య బాబుకి మధ్య జరిగే యుద్ధసన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం టైగర్ షాఫ్ర్ ఏ ఫ్లైయింగ్ జాట్ చిత్రంలో జోన్స్ నటిస్తున్నాడు. దీంతో అతను శాతకర్ణిలో నటించడం అంతా ఉత్తదేనని మరో వార్త వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bala Krishna  100 movie  Gauthamiputra Satakarni  Hollywood  Nathan Jones  Villian  Greek King  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more