megastar chiranjeevi 150th movie rumours

Megastar chiranjeevi 150th movie rumours

megastar 150th movie, megastar next, chiru movie, kattilantodu, v v vinayak, anushka, anushka in kattilantodu, kajal, megastar chiru

megastar chiranjeevi 150th movie kattilantodu facing many rumours. till now its not regular shooting going on. this movie directed by vv vinayak and planing the scedules in this month ending

చిరంజీవి సినిమాలో మరో ట్విస్ట్...!

Posted: 06/15/2016 02:02 PM IST
Megastar chiranjeevi 150th movie rumours

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాపై ఎలాంటి న్యూస్ వినిపించినా ఫ్యాన్స్ ఆసక్తికరంగా అటువైపే చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాపై ఒక కొత్త విషయం మార్కెట్ లో గుప్పుమంది. గంతలో కత్తిలాంటోడు సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే శ్రీజ పెళ్లిలో కూడ చిరు గెడ్డం తోటే దర్శనమిచ్చాడు. ఆ గెటప్ లో ఒక రోల్ ఉంటుందనుకున్నారు అందరూ. కానీ, ఇప్పుడు తాజాగా మా అవార్డ్స్ ఫంక్షన్ లో చిరంజీవి గెడ్డం లేకుండా నీట్ షేవ్ తో కనిపించాడు. పైగా ఈ ఫంక్షన్ లో చాలా స్లిమ్ గా కూడ కనిపించి అందరినీ తన డ్యాన్స్ తో అబ్బురపరిచాడు కూడ.
ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ అవార్డ్స్ ఫంక్షన్‌లో చిరు స్లిమ్‌గా కనిపించడంతో ‘కత్తిలాంటోడు’కి మళ్లీ ఏమైంది? ఏమైనా సమస్య వచ్చిందా? గెడ్డం ఎందుకు తీసినట్టు? అందుకు సంబంధించి పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యిందా? అంటూ చర్చించుకోవడం మొదలైంది.  

నిజానికి చిరంజీవి సినిమా జూన్ 6న సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు అందరూ, కానీ అది వాయిదా పడి 15వ తేది అంటున్నారు. కానీ, ఇప్పటివరకూ ఆ ఊసే ఎక్కడా కనిపించడం లేదు. ఈనెలాఖరుకి ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుందని మరో టాక్ కూడ వినిపిస్తోంది. దీంతో అవార్డ్ ఫంక్షన్ కి వచ్చిన అతిథులందరూ అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది ? అనే ప్రశ్నలతోనే చర్చించుకున్నారట. ఈ టాపిక్ ఇప్పుడు హాట్ హాట్ గా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఎక్కడ చూసినా చిరంజీవి స్టెప్స్ గురించి కత్తిలాంటోడు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరు ల్యాండ్‌మార్క్ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో? ఈ రూమర్లుకి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar chiru  chiru dance  chiru maa awards  chiru kattilantodu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more