కేసీఆర్ చిరు సాయం ఎవరికోసం? | kcr nod for star hero studio construction in hyderabad

Kcr nod for star hero studio construction in hyderabad

kcr nod for star hero studio, top star studio in hyderabad, KCR chiranjeevi, chiranjeevi studio in hyderabad, కేసీఆర్ స్టూడియో, హైదరాబాద్ లో చిరు స్టూడియో, కేసీఆర్ చిరు స్టూడియో, చిరు స్టూడియోకి లైన్ క్లియర్, తాజా వార్తలు, రాజకీయాలు, తెలుగు వార్తలు, latest news, political gossips, telangana news, telugu news

kcr nod for star hero for studio construction. kcr nod for star hero studio construction in hyderabad

కేసీఆర్ చిరు సాయం ఎవరికోసం?

Posted: 06/10/2016 06:14 PM IST
Kcr nod for star hero studio construction in hyderabad

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుగు చలన చిత్ర పరిశ్రమపై మంచి పట్టు ఉంది. సినిమాలు పెద్దగా చూడకపోయినప్పటికీ నటీనటులతో ఆయన మంచి సంబంధాలు కొనసాగిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయాక చిత్ర పరిశ్రమ మొత్తం ఏపీకి తరలిపోతుందన్న పుకార్ల దశలో అలాంటి అవసరం ఏం లేదంటూ భరోసా ఇచ్చారు. విడిపోయింది భౌగోళికంగానే కానీ, మనుషులపరంగా కాదని, తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడే నిరభ్యరంతంగా కొనసాగొచ్చని పేర్కొన్నారు.

ఒకానోక దశలో రాచకొండ ప్రాంతంలో భారీ ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు ఆలోచన చేసినప్పటికీ రామోజీ రావు నుంచి వచ్చిన విజ్నప్తితో ఆయన వెనక్కి తగ్గాడన్న టాక్ ఉంది. మరోవైపు ఉన్న వనరులతో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చెయొచ్చని సినీ పెద్దలంతా కోరటంతో ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టాడని భోగట్టా. అయితే త్వరలో హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా ఓ స్టూడియో నిర్మాణానికి కేసీఆర్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ అగ్రహీరోగా కొనసాగిన ఆయన అభిమానుల అండతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే అందరివాడిగా రాణించలేక ఢీలా పడిపోయిన ఆయన చాలా గ్యాప్ తర్వాత ముఖానికి రంగు వేసుకోబోతున్నారు. అయితే పనిలో పనిగా ఇరు రాష్ట్రాల్లో స్టూడియోల నిర్మించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇప్పటికే వైజాగ్ లో స్థలాన్ని ఎంపిక చేసిన ఆయన దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక తెలంగాణ లో నిర్మించబోయే స్టూడియో కోసం తెలంగాణ ప్రభుత్వ మద్ధతు కోసం ఇంత కాలం ఎదురు చూశారు.

ఇటీవల కేసీఆర్ తో కలిసి ఓ చిత్ర ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ స్టార్ హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణ ప్రతిపాదనను ఆయన ముందు ఉంచారంట. రాజకీయాలపరంగా కూడా ఆ స్టార్ హీరోతో ఎలాంటి వైరమ్యం లేకపోవటంతో దీనికి సుముఖత వ్యక్తం చేసిన కేసీఆర్ అందుకు అవసరమైన సాయం అందిస్తానని హామీ కూడా ఇచ్చారంట. అడ్డంకులు లేకపోవటంతో త్వరలో స్టూడియో నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థల ఎంపిక తోపాటు, అవసరమైన అనుమతులు కూడా టీ సర్కార్ నుంచి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆ స్టూడియో కోసం ఎన్నో పేర్లు పరిశీలించి చివరకు తన ఇంటి పేరును ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో!

భాస్కర్   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T CM KCR  top star studio in hyderabad  KCR chiranjeevi  chiru studio in hyderabad  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more