maheshbabu upcoming movies are coming very fast

Maheshbabu upcoming movies are coming very fast

maheshbabu, prince maheshbabu, maheshbabu next movies, maheshbabu upcoming, maheshbabu directors, maheshbabu vs murugadas, maheshbabu vs vamsy paidipalle, maheshbabu vs purijaganath, maheshbabu and vikram k kumar

prince maheshbabu upcoimng movies are coming very fast and doing maheshbabu his own banner. next movies directors already confirmed. he is very busy in tollywood.

నీ కంటే తోపు ఎవడూ లేడిక్కడ..?

Posted: 06/08/2016 11:42 AM IST
Maheshbabu upcoming movies are coming very fast

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మంచి జోరుమీదున్నాడు. ఈ స్పీడ్ కి బ్రేక్ లు వేసేవాళ్లే లేరు అంటున్నారు అభిమానులు. ఎందుకంటే, ప్రస్తుతం లండన్ టూర్ ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ రాంగానే డైరెక్టర్ మురుగదాస్ సినిమాలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ సినిమా చేస్తూనే డైరెక్టర్ పూరీజగన్ అడిగిన 45రోజుల డేట్స్ ఇచ్చేశాడట. అంటే, మురుగదాస్ సినిమా చేస్తూనే పూరీజగన్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడన్నమాట. ఈ తర్వాత వంశీ పైడిపల్లితో కథా చర్చలు జరిపి ఆ సినిమాని కూడ ఈ సంవత్సరమే ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు.

ఎందుకంటే, బ్రహ్మోత్సవం సినిమా నిరాశ పరచిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన పివిపి సంస్థకి భారీ నష్టమే వచ్చిందట. అందుకే వంశీ పైడిపల్లి తో తను చేయబోయే సినిమాని పివిపి బ్యానర్ లోనే తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. అందుకే, ఈ సినిమాని సాధ్యమైనంత వరకూ స్పీడ్ గా స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నాడు.
 
ఈ సినిమా తర్వాత కూడ మహేష్ బాబు స్టార్ హిట్ డైరెక్టర్ అయిన విక్రమ్ కె కుమార్ కి కూడ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ చెప్పిన స్టోరీని ఓకే చేసిన మహేష్ ఇప్పుడు ఈ సినిమాని కూడ లైన్లో పెట్టేస్తున్నాడు.

టాలీవుడ్ లో ఇప్పటి వరకూ మహేష్ ఎప్పుడు ఇలా నాలుగు సినిమాలను వెంటవెంటనే ఒప్పుకున్న సందర్భాలు లేవని, ఇప్పుడు మహేష్ దూకుడుకి సాటిలేదని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాకుండా, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం వరకూ కూడ మహేష్ బాబు డేట్స్ ఖాళీగా లేవని అందుకే ఇప్పుడే ఫ్యామిలీతో ఫారిన్ టూర్ ఎంజాయ్ చేయడానికి వెళ్లాడని, ఇక వచ్చిన తర్వాత ఫుల్ వర్క్ లోకి దిగిపోతాడని చెప్తున్నారు. రానున్న రెండు సంవత్సరాలు మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగేనని, మహేష్  సెలెక్ట్ చేసుకున్న దర్శకులు నలుగురు ప్రత్యేకమైన స్టైల్ ఉన్నవాళ్లేనని అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ కంటే తోపు ఎవడూ లేడిక్కడ అని చెప్తున్నారు సినీ పండితులు.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maheshbabu  vikram k kumar  mahesh next  purijaganath  vamsy paidipalle  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more