jr ntr janatha garrage movie bussiness going huge

Jr ntr janatha garrage movie bussiness going huge

mohanlal, jr ntr , jr ntr success, jr ntr market, jr ntr malayalam market, mohanlal in janatha garrage, janahta garrege marekt, koratala siva vs jr ntr, jr ntr in kollywood, jr ntr japan fans

jr ntr janahta garrage movie bussiness in all areas coming more than expectations, in this movie pre release bussiness going on day by day double. especially in malyalam market coming very huge because of mohanlal leading role in this movie

బిజినెస్ అదిరింది గురూ..!

Posted: 06/06/2016 05:31 PM IST
Jr ntr janatha garrage movie bussiness going huge

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న 'జనతా గ్యారెజ్' సినిమాపై అభిమానుల్లో ఇప్పట్నుంచే ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్యనే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో అభిమానులంతా సినిమాపై అంచనాలను మరింత పెంచేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కొరటాల శివ తెరకెక్కించిన సినిమా కావడంతో జనతా గ్యారెజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అటు మాలీవుడ్ లో అయితే మోహన్ లాల్ సినిమాలో ఉన్నాడనో లేదా తారక్ సంచలన మార్కెట్టో తెలీదు కానీ సినిమాకి భారీ స్థాయిలో రేటు పలుకుతోందట. ఇక తమిళంలో కూడ ఈ సినిమాకి మార్కెట్ తక్కువగా ఏమీలేదు. విపరీతంగా సినిమాకోసం భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా తెలుగు సినిమాకు మంచి మార్కెట్ ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఈ సినిమాను పంపిణీ చేసేందుకు పలు పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 7 కోట్లకు ఈ ప్రాంత పంపిణీ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం.  ఇటీవలే ఈ సినిమా చెన్నైలో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని త్వరలోనే హైద్రాబాద్‌లో ఓ షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ సినిమాలో ఇప్పటికే భారీ తారగణాన్ని అన్ని భాషల్లోనుంచి దింపిన డైరెక్టర్ కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ ని ఈ సినిమాతో ఒక్కసారిగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా ద్వారా ఓవర్సీస్ బిజినెస్ కూడ ఎన్టీఆర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాకి ఆ మార్కెట్ కూడ తోడయ్యింది. ఇక ఈ ట్రేడ్ గణాంకాలను చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  jr ntr market  mohanlal  koratala siva  samantha  janatha garrage movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more