తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ మాత్రం అటు అగ్రహీరోలతో సినిమాలు చేస్తూనే ఇటు కుర్రహీరోలతో కూడ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది తమన్నా, కాజల్ అయితే ఇప్పుడు ఆలిస్ట్ ని ఓవర్ టేక్ చేస్తూ సమంత వారికంటే ముందుకు దూసుకుపోయిందనే అంటున్నారు సినీ పండితులు.
ఎందుకంటే, ఇటీవల కాలంలో సమంత చేసినన్ని సౌత్ ఇండియన్ సినిమాలు మరే హీరోయిన్ చేయలేదు. కాజల్ అగర్వాల్ కేవలం తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసింది. అదే 2015లో అయితే జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాలో మాత్రమే నటించింది. అలాగే తమన్నా కూడ కొన్ని సినిమాలతోనే గత రెండు సంవత్సరాలుగా బండిలాగింది. కానీ, సమంత మాత్రం అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోను వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయింది.
అంతేకాకుండా, సమంత ఈ సంవత్సరం ఏకంగా 6 సినిమాలు చేస్తే వచ్చే యేడాదికి అమ్మడి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. దీనినిబట్టే సమంత ఎంత బిజీగా ఉందో చెప్పొచ్చు. తమిళంలో అటు విక్రమ్ , విజయ్ , సూర్యలాంటి టాప్ స్టార్స్ తో నటిస్తే, తెలుగులో మహేష్ బాబు, నితిన్ , జూనియర్ ఎన్టీఆర్ లతో నటిస్తూ ప్రేక్షకులను తనదైన స్టైల్లో అలరించింది. ఇప్పుడున్న అగ్రహీరోయిన్స్ అందర్ని ఓవర్ టేక్ చేసుకుంటూ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ పొజిషన్ లో కూర్చుంది. తెలుగులో నెం వన్ హీరోయిన్ గా ఈ సంవత్సరం తన మార్క్ ని చూపించిందంటున్నారు సినీ పండితులు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more