jr ntr nagachaitanya movies releasing in august

Jr ntr nagachaitanya movies releasing in august

jr ntr janatha garrage release, nag chaitu premam movie release, jr ntr vs naga chaitanya, jr ntr in action, nag chaitu classical touch, naga chaitu premam, malayalam remake chaitu, premam movie in august

jr ntr nagachaitanya movies are releasing in august: jr ntr janatha garagge and naga chaitanya movie premam releasing in same in the month of august. janathagarrage movie is mass action movie, and chaitu premam movie is class and heart touching movie.

ఒకరు మాస్...మరొకరు క్లాస్...!

Posted: 06/04/2016 12:53 PM IST
Jr ntr nagachaitanya movies releasing in august

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 12న ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే గ్యారేజ్ యూనిట్ రెస్ట్ లేకుండా కష్టపడుతోంది. ఎర్రటి ఎండల్ని కూడా లెక్క చేయకుండా నడి వేసవిలోనూ షూటింగ్ జరిపారు.

ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 12 అంటే అప్పటికే వేసవి పూర్తయిపోతుంది కాబట్టి ఎన్టీఆర్‌కి పోటీ ఉండదని, కేవలం జూనియర్ ఎన్టీఆర్ సినిమా సోలోగానే హిట్ కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ నాగచైతన్య 'ప్రేమమ్‌' కూడా అదే రోజునే విడుదలయ్యేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

'ప్రేమమ్' సినిమా మలయాళంలో ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా ఫస్ట టైమ్ చైతూతో శృతి హాసన్ జతకడుతోంది. ఈసినిమా క్లాస్ ప్రేక్షకులను, బిసి సెంటర్స్ ని ఆకట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇద్దరు యంగ్ హీరోల చిత్రాలు ఒకే రోజు విడుదలవుతాయి కాబట్టి బాక్సాఫీసు కళకళలాడిపోవడం ఖాయం అని, ఒకరు క్లాస్ గా వస్తే మరొకరు మాస్ గా వస్తున్నారు కాబట్టి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  tarak  naga chaitanya  chaitu  premam movie  janatha garrage movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more