Pawan Kalyan | Satyameva Jayate | Sardaar Gabbar Singh | News

Pawan kalyan entry into small screen with satyameva jayate

Pawan Kalyan in telugu Start Satyameva Jayate, Pawan Kalyan in Start Satyameva Jayate, Pawan Kalyan replace Aamir khan, Pawan Kalyan latest news, Pawan Kalyan hot news, Pawan Kalyan latest updates, Pawan Kalyan

Pawan Kalyan Entry Into Small Screen with Satyameva Jayate: Powerstar Pawan Kalyan who is currently busy with the shooting of Sardaar Gabbar Singh.

సత్యమేవ జయతే కాదు.. ‘సత్యాగ్రహి’

Posted: 01/08/2016 01:55 PM IST
Pawan kalyan entry into small screen with satyameva jayate

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా త్వరలోనే బుల్లితెరమీద మొదలుకానుంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను వెండితెర మీద చూసాం, అదే విధంగా ఆయన సినిమాలను, ఇంటర్వ్యూలను బుల్లితెర మీద చూసాం కానీ స్పెషల్ గా పవన్ కళ్యాణ్ తో ఎలాంటి ప్రొగ్రాంలు బుల్లితెరపై రాలేవు.

అలాంటిది త్వరలోనే పవన్ కళ్యాణ్ బుల్లితెరపై సందడి చేయబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వినబడుతున్న హాట్ టాపిక్ ఇదే. హిందీలో అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం ఎంత సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. ఇదే కార్యక్రమాన్ని పలు భాషలకు డబ్బింగ్ చేసి ప్రసారం చేయగా, అక్కడ కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా వుంటే ఈసారి నేరుగా ‘సత్యమేవ జయతే’ కార్యక్రమాన్ని నేరుగా తెలుగులో రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఈటీవి ఛానెల్ యాజమాన్యం రామోజీరావుతో మంచి స్నేహం వుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఈటీవిలో ప్రసారం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. తెలుగులో ఈ కార్యక్రమానికి ‘సత్యాగ్రహి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే సమాజం కోసం పవన్ కళ్యాణ్ గతంలో ‘సత్యాగ్రహి’ అనే సినిమా తీయాలనుకున్నారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. కానీ ఆ టైటిల్ చాలా పాపులర్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు అదే పేరును ఈ షో కోసం పెట్టనున్నారని తెలిసింది.

అసలే పవన్ కళ్యాణ్ సత్యం, ధర్మం, అహింస...అనే సిద్ధాంతాలను ఖచ్చితంగా పాటిస్తూ వుంటాడు. ఇక ప్రజల కష్టాలను తీర్చాడానికి ఇటీవలే ‘జనసేన’ పార్టీని స్థాపించి, ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం ద్వారా ఆ సమస్యలను తీర్చడానికి ఓ సైనికుడు/శ్రామికుడిగా కృషిచేస్తున్నాడు. అలాంటి ‘సత్యమేవ జయతే’ వంటి ప్రజల సమస్యలను తెలుసుకొనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పాల్గొనబోతున్నాడని సమాచారం.

త్వరలోనే ఈ కార్యక్రమం సెట్స్ పైకి వెళ్లనుందని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా తెలియనున్నాయని సమాచారం. ఇదిలా వుంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లోనూ మరియు రాజకీయ సమావేశాలతో బిజీగా వున్నారని.. అందువల్ల ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగనుందో చూడాలి.

పవర్ స్టార్ టీవిల్లో రాబోతున్నాడంటే అందరికి సంతోషమే కదా! ఒకవేళ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ నిజంగా చేస్తే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ విషయంపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Satyameva Jayate  Sardaar Gabbar Singh  News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more