మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ‘మెరుపు’ అనే సినిమా ముహూర్త కార్యక్రమాలు జరుపుకొని, ఆగిపోయిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఆ ప్రాజెక్టు అటకెక్కయడంతో, దాని సంగతే మర్చిపోయారు. అయితే ఆ ప్రాజెక్టుకు పెట్టిన టైటిల్ ను తమిళ స్టార్ హీరో, ఇళయథలపతి సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తేరి’. ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతునన్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు విజయ్ నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలయ్యి, మంచి విజయం సాధించాయి. అయితే ‘థేరి’ చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వర్షెన్ కోసం ‘మెరుపు’ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవలే విడుదలైన ‘థేరి’ ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఇందులో విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more