పాలరాతి శిల్పానికి ప్రాణం వస్తే ఎలా వుంటుందో అచ్చం అలాగే వుంటుంది బబ్లీ బ్యూటీ రాశిఖన్నా. పాలవలె తెల్లటి రంగు, చూడటానికి ముద్దుగా, బొద్దుగా కనిపించే అందం, యూత్ ను కట్టిపడేసే గ్లామర్... సినిమాలకు కావాలసిన హాట్ హాట్ హంగులు, సొగసులతో పాటు యాక్టింగ్ ఈ అమ్మడి సొంతం.
ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు విజయం సాధిస్తుండటమే కాకుండా యూత్ లో రాశిఖన్నాకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో యువ హీరోలంతా కూడా రాశిఖన్నాను తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. టాలీవుడ్ నిర్మాతలు కూడా రాశిఖన్నా డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం తనకు పెరిగిన ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్ కాస్త పెంచేసిందట. అయినా కూడా నిర్మాతలు ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా తెలిసింది.
మరి టాలీవుడ్ లో ఇలా వరుస ఆఫర్లతో బిజీగా వున్న ఈ అమ్మడు ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. అదేంటంటే... ఇకనుంచి టాలీవుడ్ లోనే వుండాలని అనుకుంటుందట. అంటే సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ నుంచి రావడం, ఆ తర్వాత హోటల్లో వుండటం, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లిపోవడం చాలా రిస్క్ అవుతోందట.
అందుకే హైదరాబాద్ లోనే ఓ అందమైన ఇల్లు కొనేసిందట రాశిఖన్నా. ఈ ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి వుండనుందని తెలిసింది. ఇక రాశిఖన్నా హైదరాబాద్ కే మకాం మార్చేస్తోందని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలకు, హీరోలకు అందుబాటులో వుండేందుకు రాశిఖన్నా మంచి నిర్ణయమే తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more