Balakrishna Dictator | Anjali | Director Sriwas

1 crore song for balakrishna dictator movie song

1 Crore Song For Balakrishna Dictator Movie, Balakrishna Dictator film release on Pongal 2016, Balakrishna Dictator movie news, Balakrishna Dictator stills, Balakrishna Dictator trailer, Balakrishna Dictator Release Date, Balakrishna Dictator

1 Crore Song For Balakrishna Dictator Movie Song: Nandamuri Balakrishna Dictator shooting nears to complete. Sriwass direction. Thaman music. Anjali, Sonal chauhan, aksha heroines.

బాలయ్య డిక్టేటర్ సాంగ్ కోసం 1 కోటి?

Posted: 11/16/2015 05:50 PM IST
1 crore song for balakrishna dictator movie song

మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ సినిమాలు. బాలయ్య సినిమాలంటే కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు, యాక్షన్, ఫైటింగ్స్, డాన్సులు, రొమాన్స్... ఇలా అన్నింటిలో కూడా బాలయ్య అదరగొట్టేస్తూ వుంటాడు. ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలతో బాలయ్య దుమ్మురేపేసాడు. రికార్డుల మోత మోగించాడు.

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. ఈ సినిమా విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారిపోయాడు బాలయ్య. ఈ సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ కోసం ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేసారు. ఈ సెట్ రోజుకు 30 లక్షలు ఖర్చు అవుతోందట. ఈ పాటను 4 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లుగా తెలిసింది. అందువల్ల ఈ పాట కోసం నిర్మాతలు కోటి రూపాయలు కేటియించినట్లుగా సమాచారం.

ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలయ్య సరసన అంజలి, సోనల్ చౌహన్, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే 90% షూటింగ్ పూర్తయ్యింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను అమరావతిలో విడుదల చేయనున్నారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

సుమన్, పవిత్రా లోకేష్, నాజర్, వెన్నెలకిషోర్, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, హేమ, కబీర్, విక్రంజీత్, అజయ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం.రత్నం, కథ-స్క్రీన్ ప్లే: కోనవెంకట్-గోపిమోహన్, నిర్మాత: ఈరోస్ఇంటర్నేషనల్, కో ప్రొడ్యూసర్, దర్శకత్వం: శ్రీవాస్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  1 Crore Song  Release Date  Trailer  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more