Pawan Kalyan To Do His Next Project With His Gabbar Singh Director Harish Shankar | Producer Dilraju News

Pawan kalyan harish shankar tie for another movie tollywood gossips

pawan kalyan, harish shankar, tollywood news, producer dil raju, subramanyam for sale, gabbar singh movie, pawan with harish shankar, pawan with dil raju

Pawan Kalyan Harish Shankar Tie For Another Movie Tollywood Gossips : The Gossips Going Viral In Tollywood Industry That.. Pawan Kalyan To Do Another Project With Harish Shankar Who Gave Him Biggest Blockbuster With Gabbar Singh.

‘గబ్బర్ సింగ్’ జంటపై సినిమా పుకార్లు!

Posted: 09/24/2015 07:17 PM IST
Pawan kalyan harish shankar tie for another movie tollywood gossips

‘గబ్బర్ సింగ్’.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది. దీంతో.. పవన్-హరీష్ కాంబో హిట్ జాబితాల్లోకి చేరిపోయింది. ఇప్పుడు ఈ జంటపై కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా రహస్యంగా జరుపుతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ ఊహాగానాలు తెరమీదకి రావడానికి గల కారణం ఏమిటంటే.. ఆయా సందర్భాల్లో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ప్రకటనలే!

ఓ సందర్భంలో.. తాను పవన్ కల్యాణ్ కోసం ఒక కథను సిద్ధ చేసుకున్నానీ హరీష్ శంకర్ పేర్కొన్నాడు. పవన్ కథను విని, గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నానని తెలిపాడు. అంతేకాదు.. తాను ఎప్పుడూ పవన్ కి ఒక ఫోన్ కాల్ దూరంలోనే వున్నానంటూ తరచూ పేర్కొన్న సందర్భాలూ చాలానే వున్నాయి. అదే సమయంలో.. తన నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దిల్ రాజు ప్రకటించాడు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని వెల్లడించాడు. ఇలా ఈ విధంగా వారిద్దరు ప్రకటనలు చేసిన నేపథ్యంలో.. దిల్ రాజు నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకుడిగా పవన్ తో ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో మొదలైంది. మరి.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే!

ఇదిలావుండగా.. దిల్ రాజు నిర్మాతగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం గురువారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టవచ్చునని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ చిత్రం విజయం సాధించడంతో మరో మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ సినిమా పవన్ తోనే వుంటుందని అంతర్గత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  dil raju  harish shankar  gabbar singh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more